
టీమిండియా మహిళా బ్యాటర్ స్మృతి మంధాన వన్డే ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో దుమ్ములేపుతోంది. బరిలోకి దిగిన ప్రతిసారి హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేస్తూ ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా మారింది. ఈ టీమిండియా యువ ఓపెనర్‌ను ఔట్ చేయలేక ప్రత్యర్థి బౌలర్లు తల పట్టుకుంటున్నారు. చేజింగ్‌లో 25 ఏళ్ల స్మృతి మంధాన ఆ రేంజ్‌లో విజృంభింస్తుంది. చేజింగ్‌లో ఆమె ఆడిన చివరి 14 ఇన్నింగ్స్‌లను గమనిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. చేజింగ్‌లో గత 14 ఇన్నింగ్స్‌లో స్మృతి ఏకంగా 11 సార్లు 50కి పైగా పరుగులు సాధించింది. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. వరుసగా 10 ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు సాధించడం విశేషం.
లక్ష్య చేధనలో గత చివరి 14 ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన 64 సగటుతో 898 పరుగులు చేసింది. ఇందులో 10 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 105 పరుగులుగా ఉంది. స్మృతి తన చివరి 14 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 71, 13, 22, 49, 80*, 74, 63, 90*, 105, 73*, 53*, 86, 52, 67 పరుగులు చేసింది. ఈ గణాంకాలను చూస్తేనే అర్థమవుతుంది చేజింగ్‌లో స్మృతి మంధాన ఏ రేంజ్‌లో చెలరేగుతుందో. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా ఈ టీమిండియా ఓపెనర్ నిలిచింది. దీంతో ఈ యువ బ్యాటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
కెరీర్‌లో ఇప్పటివరకు 63 వన్డే మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధాన 41 సగటుతో 2390 పరుగులు చేసింది. ఇందులో 4 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 135 పరుగులుగా ఉంది. 84 టీ20 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 1971 పరుగులు చేసింది. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 86 పరుగులుగా ఉంది. అలాగే 4 టెస్టు మ్యాచ్‌ల్లో 46 సగటుతో 325 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 127 పరుగులుగా ఉంది.