
జట్టు విజయంలో కీలకపాత్ర
ఈ క్రమంలో బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి మంధాన 63 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మంధాన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 51 మ్యాచ్‌ల్లో 43.08 యావరేజితో 2025 పరుగులు చేయడంతో... కోహ్లీ (53), గంగూలీ (52), సిద్ధు (52) కంటే అత్యంత వేగంగా వన్డేల్లో 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది.

2000 పరుగుల మైలురాయిని అందుకున్న
మహిళల క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న జాబాతాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్(45 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉంది. బెలిండా క్లార్క్ కేవలం 40 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాదించింది. కాగా, బుధవారం విండిస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత బౌలర్లు జులన్ గోస్వామి, పొన్నమ్ యాదవ్ రాణించడంతో ఆతిథ్య జట్టు 194 పరుగులకే చాపచుట్టేసింది.
2-1తో వన్డే సిరిస్ కైవసం
195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టులో మంధాన, రోడ్రిగెస్(92 బంతుల్లో 69) తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మంధాన(74) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరడంతో అనంతరం క్రీజులోకి వచ్చిన మిథాలీ, పూనమ్ రౌత్ జట్టుకి విజయాన్నందించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది.


Click it and Unblock the Notifications












