Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మందాన ఒంటరి పోరు.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

 Smriti mandana made India score a big

హైదరాబాద్: ఆసీస్‌ మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన భారత మహిళలకు మరో షాక్‌ తగిలింది. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బార్బోర్న్‌ స్టేడియంలో గురువారంఆస్ట్రేలియా మహిళలతో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో పరాజయం చెందారు. భారత మహిళలు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది.

భారత ఇన్నింగ్స్:

ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిల జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 152 పరుగులు చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌ఉమన్ స్మృతి మంధాన(67) 41 బంతుల్లో (11ఫోర్లు, 2సిక్సర్లు) విజృంభించింది. దీంతో భారత జట్టు మొత్తంలో ఆమే అత్యధిక స్కోరు చేయగలిగింది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

పేలవ రీతిలో భారత బ్యాటింగ్:

మరో ప్లేయర్ అనూజ పాటిల్(35) మాత్రమే ఆశించిన మేర రాణించింది. సీనియర్ ఓపెనర్ మిథాలీ రాజ్(18), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(13) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డ్‌నర్, ఎల్సీ పెర్రీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి మూడు వికెట్లు పడగొట్టి ఒక సమయంలో గెలుపు ఆశలు కనబర్చినా భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది.

Story first published: Thursday, March 22, 2018, 15:17 [IST]
Other articles published on Mar 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+