
హైదరాబాద్: ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు యాషెస్ సిరిస్‌తో తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ అద్భుత ప్రదర్శన చేయగా... వార్నర్ మాత్రం నిరాశపరిచాడు.
తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరిస్‌కు వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. అక్టోబర్ 27 నుంచి శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టుని ప్రకటించింది. స్మిత్, వార్నర్‌లు తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.
బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. నిషేధ సమయం ముగియడంతో ఇద్దరినీ తిరిగి జట్టులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా అరోన్ ఫించ్ సారథ్యం వహించనున్నాడు.
లంకతో టీ20 సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
అరోన్‌ఫించ్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మట్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, బిల్లీ స్టాన్‌లేక్, మిచెల్ స్టార్క్, ఆష్టన్ టర్నర్, ఆండ్రూ టై, డేవిడ్ వార్నర్, ఆడం జంపా