Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : కెప్టెన్సీ మార్చేందుకు ఆసీస్ ప్లాన్.. మూడో టెస్టులో గెలుస్తుందా?

Smith to captain Australia in remaining two tests against India

భారత్‌తో మూడో టెస్టుకు ముందు వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశం వెళ్లాడు. మార్చి 1న మొదలయ్యే మూడో టెస్టుకు ముందే అతను తిరిగి వచ్చేస్తాడని సమాచారం. అయితే ఒకవేళ మరేదైనా కారణంతో అతను మూడో టెస్టు సమయానికి జట్టుతో చేరకుంటే.. అతని స్థానంలో జట్టు పగ్గాలను స్టీవ్ స్మిత్ అందుకోనున్నాడని తెలుస్తోంది. కుటుంబంలో ఏదో మెడికల్ సమస్య రావడంతో కమిన్స్ ఇంటికి వెళ్లినట్లు సమాచారం.

 కెప్టెన్‌గా స్మిత్..

కెప్టెన్‌గా స్మిత్..

ఈ క్రమంలో అతను మిగతా టెస్టులు ఆడతాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి అవరసరమైతే మిగతా టెస్టుల్లో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అందించేందుకు టీం మేనేజ్‌మెంట్ యోచిస్తోందని తెలుస్తోంది. భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే మూడో టెస్టుకు ముందు ఆ జట్టుకు శుభవార్త వినిపించింది. జట్టులో కీలకమైన సభ్యుడిగా ఎదుగుతున్న యువ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ పూర్తిగా కోలుకున్నాడని ఆసీస్ వర్గాలు చెప్తున్నాయి.

మిడిలార్డర్ బలం..

మిడిలార్డర్ బలం..

మూడో టెస్టులో కామెరూన్ గ్రీన్ కూడా ఆడతాడని సమాచారం. ఇప్పటికే గాయాల కారణంగా చిక్కుల్లో పడిన ఆసీస్‌కు ఓపెనర్ డేవిడ్ వార్నర్ భుజానికి గాయమవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో గ్రీన్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరటనిస్తోంది. వేలికి గాయం అవడంతో భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు గ్రీన్ దూరమయ్యాడు. ఇప్పుడు అతను దాదాపు కోలుకున్నాడని, అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడో టెస్టులో విజృంభిస్తాడని ఆసీస్ మేనేజ్‌మెంట్ అంటోంది. డేవిడ్ వార్నర్ కూడా లేకపోవడంతో ఆ జట్టులో ఒకస్థానం భర్తీ చేయాల్సి ఉంటుంది. సీనియర్ ప్లేయర్లను ఓపెనర్‌గా పంపినా కూడా మిడిలార్డర్‌లో గ్రీన్ చేరిక బలాన్ని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

 కీలకమైన స్పిన్నర్ కూడా..

కీలకమైన స్పిన్నర్ కూడా..

గ్రీన్‌తోపాటు కీలక స్పిన్నర్ మిచెల్ స్వెప్‌సన్ కూడా ఆస్ట్రేలియా జట్టుతో కలుస్తున్నట్లు సమాచారం. స్వెప్సన్ భార్య మొదటి కాన్పు ఉండటంతో అతను భారత్‌తో టెస్టు సిరీస్ ఆడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తతంగం పూర్తవడంతో ఇప్పుడు జట్టుతో కలిసినట్లు సమాచారం. అతను కూడా మూడో టెస్టులో ఆడతాడని తెలుస్తోంది. భారత్‌ను స్పిన్‌తో ఇబ్బంది పెట్టేందుకు టాడ్ మర్ఫీ, కునెమన్‌ను ఆసీస్ ఆడించింది. అయితే మర్ఫీ ఆకట్టుకున్నా కునెమన్ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో పాక్‌లో రాణించిన స్వెప్సన్‌‌కు అవకాశం ఇవ్వాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోందట.

Story first published: Wednesday, February 22, 2023, 17:22 [IST]
Other articles published on Feb 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+