Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత బౌలర్ శ్రీశాంత్ మరోసారి పరిమితులు దాటాడా?

Sreesanth
దర్బన్‌: కుక్క తోక వంకర మాదిరిగా భారత బౌలర్ శ్రీశాంత్ తన తీరు మార్చుకోలేదనే మాట మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పై నోరు పారేసుకున్నాడు. అయితే, దీనిపై మాట్లాడడానికి స్మిత్ నిరాకరించాడు. శ్రీశాంత్ మాటలకు స్మిత్ తన బ్యాట్ ను పైకి లేపి ఊపాడు. ఇది మంగళవారంనాడు జరిగింది. అప్పుడు ఏం జరిగిందని అడిగితే దాని గురించి తాను మాట్లాడదలుచుకోలేదని, అది తనకూ శ్రీశాంత్ కూ మధ్య జరిగింది మాత్రమేనని స్మిత్ అన్ాడు. తాను కావాల్సినంత క్రికెట్ ఆడానని, ఏది ఆడగలనో ఏది ఆడలేనో తనకు తెలుసునని, అది పూర్తిగా సాంకేతికపరమైందని అతను చెప్పాడు.

శ్రీశాంత్ పేరు ప్రస్తావించకుండా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ - కొన్ని మార్గదర్శకాలున్నాయని, వాటిని పాటించాల్సి ఉంటుందని, ఒక ఆటగాడు మరో ఆటగాడి స్పేస్ లోకి వెళ్లకూడదని, పరిమితులు దాటకూడదని అన్నాడు. శ్రీశాంత్ పరిమితులు దాటాడా, లేదా అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఒక ఓవర్ వేయడానికి ఆరేడు నిమిషాలు తీసుకుంటే కష్టమని అతను శ్రీశాంత్ తొలి టెస్టులో చేసిన తీరుపై వ్యాఖ్యానించారు. రెండో టెస్టులో మాత్రం శ్రీశాంత్ బాగా బౌలింగ్ చేశాడని అతను చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+