
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను క్లీన్ స్వీపే లక్ష్యంగా ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా చివరి రెండు మ్యాచ్‌లనూ గెలిచి ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ప్రారంభం కానుంది.
బాక్సింగ్ డే టెస్టుగా భావించే నాలుగో టెస్టుకు ప్రాక్టీస్‌లో గాయపడిన ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ బాదిన షాట్‌కు స్టీవ్ స్మిత్ గాయపడిన సంగతి తెలిసిందే. క్రిస్టమస్ డే సందర్భంగా సోమవారం స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
'ఇప్పటికీ కొంచెం నొప్పిగా ఉంది. శనివారం నొప్పి కాస్త ఎక్కువగా ఉన్నప్పిటికీ, ప్రస్తుతం కాస్త ఉపశమనం లభించింది' అని స్మిత్ చెప్పాడు. అయితే కాలి మడమ గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జాక్సన్ బర్డ్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు.
ఐదు వన్డేల సిరిస్‌ను 0-3తో ఇప్పటికే ఇంగ్లాండ్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. చివరి రెండు టెస్టుల్లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టు (బాక్సింగ్ డే)లో అమీతుమీ తేల్చుకోనుంది.
ముఖ్యంగా ఆ జట్టు సీనియర్ ఆటగాడు అలెస్టర్ కుక్ వైఫల్యం ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌ల్లో కుక్ కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడు. యాషెస్ సిరిస్‌లో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న రూట్, మొయిన్ అలీ, స్టోన్‌మన్, విన్సీ కూడా విఫలమయ్యారు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ ఓవర్టన్ గాయంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో టామ్ కురన్ లేదా మార్క్ ఉడ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇంగ్లాండ్ ప్రధాన పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ఆశించిన మేరకు ఈ సిరిస్‌లో రాణించలేకపోయారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.