కుల్దీప్ హ్యాట్రిక్ వికెట్లపై స్మిత్ ఏమన్నాడో తెలుసా?
హైదరాబాద్: కుల్దీప్ మంచి బంతులు వేశాడని, తమ బ్యాట్స్‌మెన్ తప్పిదం వల్లే కుల్దీప్ బౌలింగ్‌లో అవుటయ్యారని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలో టీమిండియా సమిష్టిగా రాణించినా... కుల్దీప్ యాదవ్ పైనే అందరిదృష్టి నెలకొని ఉంది.
మూడో బౌలర్‌గా రికార్డు
భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. వన్డేల్లో హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్ అద్బుత హ్యాట్రిక్ ఘనతపై ఆసీస్ కెప్టెన్ స్మిత్ స్పందించాడు.

కుల్దీప్ మంచి బంతులు వేశాడు
'కుల్దీప్ మంచి బంతులు వేశాడు. అతడి సగం ఓవర్ల కోటా ముగిసేవరకూ మేమే అతడిపై ఆధిపత్యం చెలాయించాం. కానీ బంతి గమనాన్ని ఎక్కువగా అంచనా వేయాలన్న తమ బ్యాట్స్‌మెన్ల తప్పిదం వల్ల అవుటయ్యారు. కుల్దీప్ బౌలింగ్‌లో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. టర్న్‌ను గమనించి స్వేచ్ఛగా పరుగులు సాధించాను' అని స్మిత్ పేర్కొన్నాడు.

ఎదురుచూసి షాట్లు ఆడాలనుకోవడం కొంపముంచింది
'మా ఆటగాళ్లు బంతి చాలా దగ్గరగా వచ్చేవరకూ ఎదురుచూసి షాట్లు ఆడాలనుకోవడం మా కొంపముంచింది. ఒకవేళ బంతి గమనాన్ని అంచానా వేశాక ఎలా ఆడాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోయాం. ముఖ్యంగా టాపార్డర్ నలుగురిలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితే ఏ జట్టయినా విజయాలు సాధిస్తుంది' అని స్మిత్ తెలిపాడు.

స్టోయినిస్ రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది
'కానీ, రెండో వన్డేలో కూడా అలా జరగలేదు. స్టోయినిస్ రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది. ఇతర బ్యాట్స్‌మెన్లు స్టోయినిస్‌లా కూల్‌గా ఆడితే సిరీస్‌లో ఈ మ్యాచ్‌తోనైనా బోణీకొట్టేవాళ్లం' ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివరించారు. రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications