
హైదరాబాద్: బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సాధించిన రెండో సెంచరీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్ బోర్న్ రెనిగేడ్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మెల్ బోర్న్ రెనిగేడ్స్ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది.
ఈ విజయంలో సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కీలకపాత్ర పోషించాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. స్మిత్ 40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్మిత్ ఇన్నింగ్స్ అసాంతం దూకుడుగా సాగింది. మరోవైపు ఓపెనర్ జోష్ ఫిలిఫ్ 61 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మెల్ బోర్న్ రెనిగేడ్స్ 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఆరోన్ ఫించ్‌కు ఇది 10వ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా 2012 తర్వాత మళ్లీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు.
2012లో మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్(111) పరుగులతో సెంచరీ సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు సెంచరీ సాధించాడు. బీబీఎల్‌లో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ. ఫలితంగా బీబీఎల్‌లో రెండు సెంచరీలు సాధించిన ల్యూక్ రైట్, క్రెయిగ్ సిమన్స్, ఉస్మాన్ ఖవాజా, డి ఆర్సీ షార్ట్‌ల సరసన ఇప్పుడు ఆరోన్ ఫించ్ చేరాడు.