
హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ 64, షాన్ మార్ష్ 44 పరుగులతో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 302 పరుగులు చేసి ఆలౌటైంది. రెండోరోజు ఓవర్ నైట్ స్కోరు 196/4 వద్ద ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ లంచ్ విరామానికి ముందే మరో 106 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మలన్ 56 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆ తర్వాత క్రీజులోకి దిగిన వారంతా విఫలమయ్యారు. మొయిన్ అలీ 38, బెయిర్ స్టో 9, స్టువర్ట్ బ్రాడ్ 20, జేక్ బాల్ 14, జేమ్స్ ఆండర్సన్ 5 పరుగులు చేయగా క్రిస్ వోక్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ చెరో 3వికెట్లు తీసుకోగా... నాథన్ లియోన్ 2, హాజెల్‌ఉడ్ ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కామరూన్ బెన్‌క్రాప్ట్ (5) పరుగుల వద్ద స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా (11) వద్ద మెయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
అనంతరం జట్టు స్కోరు 59 పరుగుల వద్ద మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (26) పరుగుల వద్ద జేక్ బాల్ బౌలింగ్‌లో మాలన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత పీటర్ హ్యాండ్స్ కోంబ్ (14) జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (64), షాన్ మార్ష్ (44)లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో 21వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్, బ్రాడ్, జేక్ బాల్, మెయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.