క్రైస్ట్ చర్చ్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా థర్డ్ అంపైర్ మార్టినెస్‌ను దూషించిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బౌలర్ హాజెల్ వుడ్‌కు ఐసీసీ జరిమానా విధించింది. వారిద్దరూ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నిర్ధారిస్తూ ఇద్దరినీ మందలించింది.
అనంతరం మ్యాచ్ ఫీజుల్లో కోత విధించింది. కెప్టన్ స్మిత్‌కు 30 శాతం, హాజెల్ వుడ్‌కు 15 శాతం చొప్పున జరిమానా వేస్తున్నట్టు తెలిపింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ విలియమ్స్ 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజిల్ వుడ్.. ఓ యార్కర్‌ను విలియమ్సన్ కాళ్లపై సంధించాడు.

ఆ వెంటనే మైదానంలోని అంపైర్ రణమోర్ మార్టినెజ్ నాటౌట్‌గా ప్రకటించాడు. కెప్టెన్ స్మిత్ రివ్యూను కోరాడు. బంతిని పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ రిచర్డ్ లిల్లింగ్ వర్త్ అది నాటౌట్‌గానే నిర్ణయించాడు. దీంతో హాజిల్‌వుడ్‌కు కోపం వచ్చింది.
దీంతో అంపైర్ మార్టినెజ్ వద్దకు వెళ్లి వాదనకు దిగాడు. 'హూ ద ఫ.. ఈజ్ ది థర్డ్ అంపైర్' అన్నాడు. అతని మాటలు రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో కామెంటేటర్లుగా ఉన్న వారు, హాజిల్ మాటలను తప్పుబట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ హాజిల్‌వుడ్, స్మిత్‌ల పైన విచారణకు ఆదేశించారు.