For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడ్‌మన్‌కి చేరువలో స్మిత్: గత 114 టెస్టుల నుంచి అగ్రస్ధానంలోనే

By Nageshwara Rao
Smith closes in on Bradman, achieves second highest batting points

హైదరాబాద్: మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన నెంబర్ వన్ ర్యాంకుని మరింత పదిలం చేసుకున్నాడు. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో 239 పరుగులు చేసిన స్మిత్ ఆస్ట్రేలియా విజయంలో స్మిత్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

పెర్త్ టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి మరో రెండు టెస్టులు మిగిలుండగానే యాషెస్ సిరిస్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాటింగ్ ర్యాంకుల్లో దిగ్గజ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ సాధించిన అత్యధిక పాయింట్లకు స్మిత్ మరింత చేరువయ్యాడు.

మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్ (942), పీటర్ మే, జాక్ హోబ్స్ (942) పాయింట్లను అధిగమించిన స్టీవ్ స్మిత్ తాజాగా ఆసీస్ క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్ సాధించిన ఆల్ టైం అత్యధిక పాయింట్లకు కేవలం 16 పాయింట్ల దూరంలో నిలిచాడు.

1948లో బ్రాడ్‌మన్ 961 పాయింట్లు సాధించాడు. టెస్టు పాయింట్లలో ఇప్పటికీ అదే అత్యుత్తమం. అయితే ఇటీవల కాలంలో స్టీవ్ స్మిత్ రోజు రోజుకూ అద్బుత ప్రదర్శన చేస్తూ, బ్రాడ్‌మన్ రికార్డుకు చేరువయ్యాడు.
టెస్టుల్లో స్టీవ్ స్మిత్ యావరేజి 62.32గా ఉంది. బ్రాడ్‌మన్ (99.94) యావరేజి తర్వాత ఇదే అత్యధికం.

గత 114 టెస్టుల నుంచి స్మిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్యారీ సోబర్స్‌ (189 టెస్టులు), వివ్‌ రిచర్డ్స్‌ (179), బ్రయన్‌ లారా (140) సచిన్‌ (139) అతనికన్నా ముందున్నారు. ఇక, స్టీవ్ స్మిత్ తర్వాత విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఛటేశ్వర్ పుజారా, కేన్ విలియమ్సన్ ఒక్కో స్థానం ఎగబాకి మూడు, నాలుగో స్థానాలకు చేరుకున్నారు.

కెరీర్‌లో ఇప్పటి వరకు 54 టెస్టులాడిన పుజారా 52.96 యావరేజితో 4,396 పరుగులు చేశాడు. రెండో స్థానంలో కొనసాగుతున్న కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి అతనికి మధ్య కేవలం 20 పాయింట్ల అంతరమే ఉంది. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్ ఆటగాడు డేవిల్ మలన్ 52వ స్ధానంలో కొనసాగుతుండగా... జానీ బెయిర్ స్టో 15వ ర్యాంకుని దక్కించుకున్నాడు.

ఇక, బౌలర్ల జాబితాలో 892 పాయింట్లతో జేమ్స్ అండర్సన్ తొలి స్థానంలో ఉండగా, 870 పాయింట్లతో రవీంద్ర జడేజా, 829 పాయింట్లతో రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. వాకాలో ఐదు వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హేజెల్‌వుడ్ ఒక ర్యాంక్ మెరుగుపర్చుకొని టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా రెండు, అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 17:55 [IST]
Other articles published on Dec 19, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+