బెంగుళూరు టెస్టు: స్మిత్ అవుట్‌పై హైడ్రామా (వీడియో)
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్లో ఉమేశ్ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీలు చేశారు. దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు.
రివ్యూ కోరదామని అనుకున్న స్మిత్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్ కోంబ్‌ను అడిగాడు. అయితే అతను మాత్రం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్‌ను సలహా కోరమని సూచించాడు. ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో స్మిత్ వెళ్లిపోయాడు.
మైదానం వీడేందుకు సమయం తీసుకున్న స్మిత్
దీంతో స్మిత్ మైదానం వీడేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. ఇదే సమయంలో అంపైర్ కంటే ముందే స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటాన్ని గమనించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ, స్మిత్‌ను వారించాడు. మైదానంలో ఉన్న హ్యాండ్స్ కోంబ్ వద్దకు వెళ్లి స్మిత్ మాట్లాడుతుండగా అంపైర్ వారిని నిలువరించాడు.
ఆసీస్ ఆటగాళ్లకు దగ్గరగా వచ్చిన కోహ్లీ
అదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లకు దగ్గరగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వచ్చాడు. దీంతో అప్రమత్తంగా వ్యవహిరించిన అంపైర్ మరోసారి స్టీవ్ స్మిత్‌ను మైదానం వీడాల్సిందిగా సూచించాడు. నిజానికి డీఆర్ఎస్‌లో భాగంగా రివ్యూ కోరాలా వద్దా? అన్నది క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్ మెన్ తీసుకోవాల్సిన నిర్ణయం.

నిబంధనలకు విరుద్ధంగా స్మిత్
కానీ స్మిత్ మాత్రం అందుకు విరుద్ధంగా డ్రెస్సింగ్ రూమ్ సలహా కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఆర్ఎస్ అంటే డ్రెస్సింగ్ రూమ్ రీవ్యూ సిస్టమా అంటూ బీసీసీఐ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను హేళన చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. మరోవైపు బెంగుళూరు టెస్టులో ఆసీస్ విజయం దిశగా పయనిస్తోంది.

స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతోంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. దీంతో బౌలర్ల సమష్టి కృషితో టీమిండియా గెలుపు బాటలో పయనిస్తోంది. 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తడబడుతోంది.

విజయానికి చేరువలో టీమిండియా
టర్నింగ్ పిచ్‌పై ఆసీస్ విజయానికి 85 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 3 వికెట్లు కావాలి. ఆసీస్ టాప్ బ్యాట్స్ మెన్లను భారత బౌలర్లు పెవిలియన్‌కు చేర్చారు. ఇది భారత్‌కు ఎంతో కలిసొచ్చే అంశం. ఆసీస్ ఆటగాడు హ్యాండ్స్‌కోంబ్‌ను వీలైనంత త్వరగా భారత్ అవుట్ చేస్తే బెంగళూరు టెస్టులో టీమిండియా విజయం సాధించినట్లే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications