Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్స్ క్యాచ్ పట్టిన యువతి: ఫాల్కనర్-కోహ్లీ స్లెడ్జింగ్ (వీడియో)

మెల్బోర్న్: దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా బౌలర్ జేమ్స్ ఫాల్కనర్‌కు ఝలక్ ఇచ్చాడు. తొలి వన్డే సమయంలో భారత్ కొత్త బౌలర్‌ను ఆసిస్ ఆటగాడు స్లెడ్జింగ్ చేశాడు. తాజాగా, మూడో వన్డేలో కోహ్లీని ఫాల్కనర్ ఏదో అనడంతో.. కోహ్లీ వెంటనే కౌంటర్ ఇచ్చాడు.

భారత్ - ఆస్ట్రేలియో మూడో వన్డే మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతోంది. కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమ్స్ ఫాల్కనర్ 35వ ఓవర్లో నాలుగు బంతులు వేశాడు.

 Sledging VIDEO: 'I have smashed you enough' says Kohli to Faulkner

ఫాల్కనర్ ఐదో బంతికి కోహ్లీ సింగిల్ తీశాడు. ఈ సమయంలో ఫాల్కనర్ ఏదో అన్నాడు. వెంటనే స్పందించిన 27 ఏళ్ల కోహ్లీ ఏమాత్రం తగ్గలేదు. వెంటనే జేమ్స్ ఫాల్కనర్‌కు ధీటుగా స్పందించే ప్రయత్నం చేశాడు.

ఐదో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో ఫాల్కనర్ ఏదో అన్నాడు. వెంటనే స్పందించిన కోహ్లీ... నేను ఎన్నోసార్లు నీ బౌలింగులో కొట్టాను, నీవు నీ ఎనర్జీ వృథా చేసుకుంటున్నావు అని అన్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఏమైందేటే...

ఫాల్కనర్‌ బౌలింగ్‌లో కోహ్లి కవర్‌ పాయింట్‌ దిశగా బంతిని నెట్టి సింగిల్‌ తీశాడు. మరో ఎండ్‌లో ఉన్న రహానె రెండో పరుగుకు అవకాశం ఉందంటూ కోహ్లిని ఆహ్వానించగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో రనౌట్‌ను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లి నిరాకరించాడు.

దీనిపై బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న బౌలర్‌ ఫాల్కనర్‌ కోహ్లిని ఉద్దేశిస్తూ అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ స్లెడ్జింగ్‌కు దిగాడు. దీంతో ఘాటుగా స్పందించిన విరాట్‌ కోహ్లి సంజ్ఞలు చూపుతూ మాటలతో ఫాల్కనర్‌పై ఎదురుదాడికి దిగాడు. ఫాల్కనర్‌ ఓవర్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బోలాండ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి లాంగాన్‌ దిశగా ఓ భారీ సిక్స్‌ బాది స్లెడ్జింగ్‌కు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. సిక్సర్‌గా వెళ్లిన బంతిని స్టాండ్స్‌లో ఓ యువతి క్యాచ్‌గా పట్టుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+