ఖర్చు భరించాల్సిందే!: శ్రీలంక జట్టుకు బొమ్మ చూపించేందుకు సిద్ధమైన పీసీబీ!

హైదరాబాద్: శ్రీలంక క్రికెట్ బోర్డు ఛీఫ్ షమ్మీ సిల్వ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశానికి భారంగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ జట్టు పాకిస్థాన్‌లో ఇటీవలే తొలిసారి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడింది.
కరాచీ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో ఆతిథ్య జట్టు కైవసం చేసుకోగా... మూడు టీ20ల సిరిస్‌ను మాత్రం శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు ఈ పర్యటనకు వెళ్లలేమని తేల్చి చెప్పడంతో లంక బోర్డు ద్వితీయ శ్రేణి జట్టుని పాక్ పర్యటనకు పంపింది.
పాక్ పర్యటనను ముగించుకుని కొలంబోకు చేరుకున్న తర్వాత భద్రత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ అసహనం వ్యక్తం చేశాడు. పాక్ పర్యటనలో తాము ఎక్కడికీ వెళ్లలేక హోటల్ గదులకే పరిమితమయ్యామని షమ్మి పేర్కొన్నాడు.

పాక్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ డిసెంబర్‌లో శ్రీలంక జట్టు పాక్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడాల్సి ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచులకే ఇంత ఇబ్బంది పడ్డామని... ఈ ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక జట్టు మళ్లీ టెస్టు సిరీస్ ఆడేందుకు గాను పాక్ పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో ఈ విషయంపై ఆటగాళ్లతో చర్చిస్తామని షమ్మి సిల్వ పేర్కొన్నాడు.

షమ్మి సిల్వ చేసిన వ్యాఖ్యలపై
దీంతో షమ్మి సిల్వ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డిసెంబర్‌లో పాకిస్థాన్ జట్టుకు శ్రీలంక జట్టు వస్తుందా.. లేదా అనే సందిగ్థంతో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ముందుగానే బెదిరింపు చర్యలకు దిగింది. పాక్ పర్యటనకు రాకుండా తటస్థ వేదికలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను నిర్వహించాలని కోరితే అందుకు అయ్యే ఖర్చును లంక క్రికెట్ బోర్డు కూడా భరించాలని తెలిపింది.

పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ
ఈ మేరకు పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ "పాక్‌లో పర్యటించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము భద్రతా పరంగా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. కొన్ని రోజుల క్రితం కరాచీ, లాహోర్ వేదికగా జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ విజయవంతమైంది. డిసెంబర్‌లో జరిగే టెస్టు సిరిస్‌ను యూఏఈలో నిర్వహించాలని పట్టుబడితే లంక బోర్డు అందుకు ఖర్చు అయ్యే ఖర్చుని భరించాలి" అని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా మద్దతు
పీసీబీలోని కొత్త నాయకత్వానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు. పాక్‌లో మ్యాచ్‌లను ఆడేందుకు నిరాకరించే జట్లపై బలమైన వైఖరి తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని, ఈ కొత్త విధానాన్ని శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లో పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జనవరిలో పాక్ పర్యటనకు రానున్న బంగ్లాదేశ్
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇది చాలా అవసరమని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఐదో సీజన్ మొత్తాన్ని పాక్‌లోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications