Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌‌లో ఆడుకోవచ్చు: లసిత్ మలింగకు ఎస్‌ఎల్‌సీ గ్రీన్ సిగ్నల్

IPL 2019 : SLC Releases Lasith Malinga To Play For Mumbai Indians In IPL 2019 | Oneindia Telugu
SLC releases Lasith Malinga to play for Mumbai Indians in IPL 2019 after criticism from BCCI

హైదరాబాద్: శ్రీలంక పేసర్ లసిత్‌ మలింగ ఐపీఎల్‌ ఆడుకోవచ్చని శ్రీలంక క్రికెట్‌ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లంక ప్రపంచకప్‌ జట్టు ఎంపికలోకి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ వన్డే టోర్నీ సూపర్‌ ప్రొవిన్షియల్‌ టోర్నీలో ఆడాల్సిందేనంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) చెప్పడంతో ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి ఆరు మ్యాచ్‌లకు దూరం కావాలని మలింగ నిర్ణయించుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో మలింగ ఆడలేదు. అయితే లంక దేశవాళీ క్రికెట్‌ టోర్నీలో మలింగ ఆడక్కర్లేదని లంక బోర్డు చెప్పడంతో అతనికి ఐపీఎల్‌కు రావడానికి మార్గం సుగమమైంది. ఐపీఎల్‌లో ఆడేందుకు లసిత్ మలింగకు ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది. ఈ మేరకు తన అధికారిక ట్వీటర్‌ పేర్కొంది.

సూపర్‌ ప్రొవిన్షియల్‌ వన్డే టోర్నీలో ఆడటం కన్నా ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్‌లో ఆడితే మలింగకు ఉపకరిస్తుందని బోర్డు ప్రకటించింది. "ఐపీఎల్‌లో ఆడటానికి ఎస్‌ఎల్‌సీ మలింగకు అనుమతి ఇచ్చింది. సూపర్‌ ప్రొవిన్షిల్‌ వన్డే లీగ్‌ నుంచి మలింగను విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌లో అతనికి అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడే అవకాశం దక్కుతుంది" అని లంక బోర్డు తెలిపింది.

మరోవైపు బీసీసీఐ జోక్యంతోనే శ్రీలంక బోర్డు తన మనసు మార్చుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

Story first published: Wednesday, March 27, 2019, 15:08 [IST]
Other articles published on Mar 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+