Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ వేసేందుకు బంగారు నాణాన్ని సిద్దం చేసిన లంక క్రికెట్ బోర్డు

SLC to provide special gold-plated coin for toss

హైదరాబాద్: 70 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ ముక్కోణపు సిరీస్‌ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమే లంక క్రికెట్ బోర్డును సైతం మొదలుపెట్టడంతో ఆ క్రికెట్ బోర్డు సైతం 70వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆ క్రికెట్ బోర్డు భారత్‌-బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసంభారీగా ఏర్పాట్లు చేపట్టింది.

సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా..దినేశ్ ఛండీమల్ సారథ్యంలో లంక జట్టు మంగళవారం కొలంబోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయడానికి ఉపయోగించే నాణాన్ని ప్రత్యేకంగా రూపొందించింది.

'ఈ సిరీస్‌లో ఫైనల్‌తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వేసే టాస్‌ కోసం ప్రత్యేకంగా ఏడు నాణేలను తయారు చేయించాం. ఈ నాణెలకు బంగారం పూత వేయించాం' అని ఆయన తెలిపారు.

'టోర్నీలో భాగంగా మంగళవారం భారత్‌-శ్రీలంక మధ్య జరగనున్న మ్యాచ్‌కు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. కొనుగోలు చేసిన అభిమానులను సాయంత్రం 5.30గంటలకే మైదానానికి తరలిరానున్నారని సుమతిపాలపేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని జోడించనున్నారు. రాత్రి 7గంటలకు యథావిధిగా మ్యాచ్‌ ఆరంభం అవుతుంది' అని సుమతిపాల వివరించారు.

ఈ మ్యాచ్‌లో ఆడనున్న ఇరు జట్లు:
భారత్‌:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్‌, మనీశ్ పాండే, రిషబ్‌ పంత్/దినేశ్‌ కార్తీక్‌, వాషింగ్టన్‌ సుందర్‌/ దీపక్ హూడా, యజువేంద్ర చాహల్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌.

శ్రీలంక:
చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా.

పిచ్‌, వాతావరణం
ప్రేమదాస మైదానం ఎక్కువగా స్లో పిచ్‌. అయితే సిరీస్‌ ఆరంభంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృత్తంగా ఉంటుంది.

ప్రత్యక్ష ప్రసారం: DSports/DDSports from 7 pm onwards

Story first published: Tuesday, March 6, 2018, 13:21 [IST]
Other articles published on Mar 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+