Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL Vs PAK 2nd Test : డిసిల్వా సెంచరీ పోరాటంతో పాకిస్థాన్‌కు శ్రీలంక దెబ్బ.. పాక్‌కు ఓటమి భయం..!

Sl vs Pak 2nd Test : Srilanka in Commonding Position as Dhananjaya De silva Scores Century

గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ 2వ టెస్టు 4వ రోజు మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగింది. పాక్‌కు శ్రీలంక ఓటమి భయం చూపించింది. బ్యాడ్ లైట్ కారణంగా ఆట కాస్త ముందుగానే ముగిసింది. ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 1వికెట్ కోల్పోయి 89పరుగులు చేసింది. ఇక చివరి రోజు 9వికెట్లు పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అంతకుముందు ధనంజయ డిసిల్వా సెంచరీ (109 పరుగులు 171బంతుల్లో 16ఫోర్లు) రాణించడంతో శ్రీలంక.. పాకిస్థాన్‌కు చివరి ఇన్నింగ్స్‌లో 508పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 360పరుగులు చేసి.. డిక్లేర్ ప్రకటించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ధనంజయ డిసిల్వా బుధవారం తమ మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు.

 తొమ్మిదో టెస్ట్ సెంచరీ చేసిన డిసిల్వా

తొమ్మిదో టెస్ట్ సెంచరీ చేసిన డిసిల్వా

ఇక మూడో రోజు శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 176పరుగులు చేయగా.. ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన వీరిద్దరు కుదురుగా ఆడారు. కరుణరత్నే (61పరుగులు) ఔటయినా.. డిసిల్వా మాత్రం క్రీజులో చాలా బాగా కుదురుకుని ఆడాడు. ఈ క్రమంలో అతను తన తొమ్మిదో టెస్ట్ సెంచరీని సాధించాడు. 109పరుగుల వద్ద అతను రనౌట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించింది. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా, మహ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. యషీర్ షా, నౌమన్ అలీ, అఘా సల్మాన్ తలా ఓ వికెట్ తీశారు.

డ్రా దిశగా మ్యాచ్

డ్రా దిశగా మ్యాచ్

ఇకపోతే తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 378పరుగులకు ఆలౌటైంది. అలాగే రమేష్ మెండిస్ 5వికెట్ల హాల్‌తో చెలరేగడంతో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231పరుగులకే ఆలౌటైంది. తద్వారా 147పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని శ్రీలంక సాధించింది. రెండో ఇన్నింగ్స్ పరుగులతో కలిసి 508పరగుల టార్గెట్ పాకిస్థాన్‌కు ఇచ్చింది. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్ షఫీక్ 16పరుగులకే ఔటయినా.. కెప్టెన్ బాబర్ ఆజామ్ (26), ఇమాముల్ హక్ (46)క్రీజులో నాలుగో రోజు ఆట ముగిసేవరకు మొండిగా నిలబడ్డారు. ఇక పాకిస్థాన్ చివరి రోజు గెలవాలంటే 419పరుగులు చేయాలి. కాగా శ్రీలంక గెలవాలంటే 9వికెట్లు పడగొట్టాలి. ఇక ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

తుది జట్లు

తుది జట్లు

శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), ఓషద ఫెర్నాండో, కుసాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, దునిత్ వెల్లలాగే, అసిత ఫెర్నాండో

పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫవాద్ ఆలం, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, నౌమన్ అలీ, నసీమ్ షా

Story first published: Wednesday, July 27, 2022, 18:13 [IST]
Other articles published on Jul 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+