
మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ప్రభాత్ జయసూర్య
ఒకానొక దశలో పాకిస్తాన్ 176పరుగులకు కేవలం 2వికెట్లు మాత్రమే కోల్పోయి.. డ్రా దిశగా సాగగా.. మెండిస్, ప్రభాత్ జయసూర్య అనూహ్యంగా పుంజుకోవడంతో 85పరుగులకే తమ చివరి ఎనిమిది వికెట్లను పాకిస్థాన్ కోల్పోయి ఘోర పరాజయం చవిచూసింది. ఇక తొలి టెస్టులో పాకిస్థాన్ సంచలన ప్రదర్శనతో గెలవగా.. లంక అంతే సంచలన రీతిలో రెండో టెస్టులో గెలిచి లెక్క సరిచేసింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ధనుంజయ డిసిల్వా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ప్రభాత్ జయసూర్య నిలిచాడు.

ఆదిలోనే దెబ్బ..
మ్యాచ్ విషయానికొస్తే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 1వికెట్ కోల్పోయి 89పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే రమేష్ మెండిస్ షాకిచ్చాడు. తన తొలి డెలివరీలోనే ఇమామ్-ఉల్-హక్‌ను పెవిలియన్ పంపించాడు. 49పరుగుల వద్ద కట్ షాట్‌కు ప్రయత్నించిన ఇమామ్ వికెట్ కీపర్ నిరోష్ డిక్వెల్ల చేతికి చిక్కాడు. దీంతో 97పరుగుల వద్ద 2వికెట్ కోల్పోయింది పాక్. బాబర్‌తో ఇమామ్ 55పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బాబార్ ఆజామ్ ఔటవ్వడంతో..
మూడో వికెట్‌కు రిజ్వాన్‌తో కలిసి 79పరుగుల భాగస్వామ్యాన్ని బాబర్ నమోదు చేశాడు. ప్రభాత్ జయసూర్య వీరి జోడిని విడదీశాడు. తన స్ట్రెయిట్ డెలివరీకి షాట్ ఆడాలని చూసిన మహ్మద్ రిజ్వాన్ (37)ను బౌల్డ్ అయ్యాడు. ఇక అనంతరం ఫవాద్ అలాం (1), అఘా సల్మాన్ (4) వెంటవెంటనే ఔటవ్వడంతో తొలి సెషన్ టైంకు 5వికెట్లు కోల్పోయి 188పరుగులు చేసింది. ఇక డ్రా చేయాలంటే 66ఓవర్లు డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి. అయితే క్రీజులో బాబర్ ఆజామ్ ఉన్నాడన్న ధీమా సైతం పాకిస్థాన్‌కు ఎంతో సేపు నిలవలేదు. లంచ్ తర్వాత బరిలోకి దిగిన బాబర్ (81పరుగులు 146బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్)ను జయసూర్య పెవిలియన్‌కు పంపించాడు. ఇక ఆ తర్వాత పాకిస్థాన్ కోలుకోలేకపోయింది. మహమ్మద్ నవాజ్ (12), యషీర్ షా (27), హసన్ అలీ (11), నసీమ్ షా(18) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో పాక్ 261పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా శ్రీలంక 246పరుగుల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్ సమ్మరీ :
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 378
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 231
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 360/8 (డిక్లేర్డ్)
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 261
246పరుగుల తేడాతో శ్రీలంక విజయం
తుది జట్లు :
శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), ఓషద ఫెర్నాండో, కుసాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, దునిత్ వెల్లలాగే, అసిత ఫెర్నాండో
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫవాద్ ఆలం, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, నౌమన్ అలీ, నసీమ్ షా


Click it and Unblock the Notifications












