For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెట్రోల్ కోసం ఆ కోల్‌కత నైట్‌రైడర్స్ క్రికెటర్ ఎన్నో అవస్థలు: రూ.10,000లతో ట్యాంక్ ఫిల్

SL vs PAK 1st test: Sri Lanka Cricketer Chamika Karunaratne Fills Petrol Worth Rs 10000

కొలంబో: పొరుగుదేశం శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇప్పటికే ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. అనంతరం అల్లర్లు చెలరేగాయి. వాటిని నియంత్రించడానికి అత్యయిక పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె- తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవ్వాళ లంక పార్లమెంట్ సమావేశం కానుంది. విక్రమసింఘెపై కూడా లంకలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

ఇంధన సంక్షోభం..

శ్రీలంక ఆర్థిక సంక్షోభం రోజుల తరబడి కొనసాగుతూనే వస్తోంది. కాలం గడుస్తున్నా దీనికి పుల్‌స్టాప్ పడట్లేదు. నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటాయి. అసాధారణ ధరకు చేరుకున్నాయి. ప్రత్యేకించి ఇంధన కొరత వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదు. దీనికోసం గంటల కొద్దీ పెట్రోల్ బంక్‌ల వద్ద లంకేయులు బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. ఇంధన అమ్మకాలను ఆయిల్ కంపెనీలు క్రమబద్దీకరించాయి. కారు, బైక్‌లకు పరిమితిని విధించాయి.

రూ.10,000 పెట్టి..

రూ.10,000 పెట్టి..

ఈ పరిస్థితుల ప్రభావం శ్రీలంక క్రికెటర్లపైనా పడుతోంది. తాజాగా క్రికెటర్ చమిక కరుణరత్నె ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు అక్కడి దుస్థితికి అద్దం పట్టాయి. పెట్రోల్ కోసం రెండు రోజుల పాటు తాను బంక్ వద్ద ఎదురు చూడాల్సి వచ్చిందని, కారులో పెట్రోల్ పోయించుకోవడానికి 10,000 రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చిందని వాపోయాడు. రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రాదని వ్యాఖ్యానించాడు.

భారత్‌కు థ్యాంక్స్..

భారత్‌కు థ్యాంక్స్..

ఇంటర్నేషనల్ సిరీస్‌, ఆసియాకప్, లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లల్లో పాల్గొనడానికి అవసరమైన ప్రాక్టీస్ సెషన్స్ కోసం కొలంబోలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, పెట్రోల్ సంక్షోభ పరిస్థితుల్లో ప్రయాణం సాగించడం కష్టతరమౌతోందని చెప్పాడు. ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి భారత్ సహకరించిందని చమిక కరుణరత్నె పేర్కొన్నాడు. ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు.

కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టులో చోటు..

కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టులో చోటు..

2019లో క్యాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో చమిక కరుణరత్నె అంతర్జాతీయ మ్యాచ్‌లల్లో అరంగేట్రం చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న శ్రీలంక క్రికెట్ జట్టులోనూ అతను సభ్యుడే. కుడిచేతి వాటం మీడియా పేస్ బౌలర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ జట్టును ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లంక తరఫున ఓ టెస్ట్ మ్యాచ్, 18 వన్డే ఇంటర్నేషనల్స్, 25 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.

Story first published: Saturday, July 16, 2022, 11:05 [IST]
Other articles published on Jul 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+