
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన అప్రతిహత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఓపెనింగ్ టెస్ట్‌లో బాబర్ ఆజాం తన ఏడో టెస్టు సెంచరీని సాధించడంతో .. శ్రీలంకకు దీటుగా పాకిస్థాన్ 218పరుగుల స్కోరు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 222 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు 38.4ఓవర్లలో 85పరుగులకే 7వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ పాకిస్థాన్‌ను బాబర్ ఆజామ్ తన మార్క్ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. బాబర్ (244 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 119 పరుగులు) తో మొండిగా క్రీజులో నిలబడ్డాడు. యాసిర్ షా (18)తో కలిసి 8వ వికెట్‌కు 27పరుగులు జోడించాడు. హసన్ అలీ (17)తో కలిసి 9వ వికెట్‌కు 36పరుగులు జోడించాడు. ఇక చివరి వికెట్‌కు నసీమ్ షా (5పరుగులు 52బంతుల్లో నాటౌట్)తో కలిసి 70పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక తీక్షణ బౌలింగ్లో బాబర్ ఆజం ఔట్ అవ్వడంతో పాకిస్థాన్ 218పరుగులకు ఆలౌటైంది. ఇక శ్రీలంక నాలుగు పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించగలిగింది.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అనూహ్యంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 12వికెట్లు తీసిన ప్రభాత్ జయసూర్య ఈ మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు తీసి తన క్లాస్ చూపించాడు. ఇక మహేశ్ తీక్షణ, మెండిస్ చెరో రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన శ్రీలంక 11.5 ఓవర్లలో 1వికెట్ కోల్పోయి 36పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (16) ఔటయ్యాడు. ఇక ఓషద ఫెర్నాండో (17), నైట్-వాచ్‌మెన్ కసున్ రజిత (3) క్రీజులో ఉన్నారు.
ఇక ఇటీవలే విరాట్ కోహ్లీనుద్దేశించి.. దిస్ టు షాల్ పాస్.. స్టే స్ట్రాంగ్ కోహ్లీ అంటూ బాబర్ ఆజం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీకి అతను సపోర్ట్‌గా నిలవడంతో అతనికి కోహ్లీ అభిమానుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఆ ట్వీట్ తెగ ట్రెండింగ్ కాగా.. తాజాగా బాబర్ సెంచరీ చేయడంతో గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) అంటూ మరోసారి బాబర్ ఆజం పేరు ట్విట్టరులో ట్రెండింగ్ అయింది. ఇక విరాట్ అభిమానులు సైతం బాబర్‌నుద్దేశించి పోస్టులు పెడుతున్నారు.