For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SL vs NZ: చరిత్ర సృష్టించిన శ్రీలంక రైజింగ్ స్టార్!

శ్రీలంక రైజింగ్ స్టార్ క్రిటర్ కామిందు మెండిస్ రికార్డులు వేట కొనసాగిస్తున్నాడు. గాలె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శతకంతో కదంతొక్కాడు. 25 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఆడిన 11 ఇన్నింగ్స్‌ల్లో నాలుగో సెంచరీ సాధించడం విశేషం. అంతేగాక ప్రతి టెస్టులో కనీసం హాఫ్ సెంచరీ బాదాడు.

ఈ కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ తన కెరీర్‌లో ఏడో టెస్టు మాత్రమే ఆడుతున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 80.9 సగటుతో 809 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మెండిస్ అరుదైన ఘనతలు సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో వరుసగా 50+ స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా కామిందు మెండిస్ చరిత్రకెక్కాడు. ఈ ఘనతను మెండిస్ కంటే ముందు పాకిస్థాన్ ప్లేయర్ సౌద్ షకీల్ సాధించాడు.

SL vs NZ Kamindu Mendis Equals Rare Record Puts Sri Lanka on Top vs New Zealand

ఇక కనీసం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఆసియా బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాడిగా కామిందు మెండిస్ కొనసాగుతున్నాడు. అలాగే ఇన్నింగ్స్‌ల గణాంకాల పరంగా వేగంగా నాలుగు శతకాలు అందుకున్న డ్రాన్ బ్రాడమన్‌‌ రికార్డు సరసన మెండిస్ నిలిచాడు. నాలుగు శతకాలు అందుకోవడానికి బ్రాడమ్ ‌న్ కూడా 11 ఇన్నింగ్స్‌లే తీసుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌లో కనీసం 10 ఇన్నింగ్స్‌‌లు కంటే ఎక్కువగా ఆడిన బ్యాటర్ల జాబితాలో అత్యుత్తమ సగటు సాధించిన ఆటగాడిగానూ మెండిస్ రికార్డలకెక్కాడు.

ఇక శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. కామెందు మెండిస్ (114; 173 బంతుల్లో, 11 ఫోర్లు) శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి లంక ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. కురుణరత్నె (2), నిస్సాంక (27) ఆదిలోనే వెనుదిరిగారు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ చండిమల్ (30), మాథ్యూస్ (36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ కివీస్ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు తీశారు. అయితే అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మెండిస్ గొప్పగా ఆడాడు. మాథ్యూస్, కుశాల్ మెండిస్ (50)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ మూడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లతో సత్తాచాటారు.

Story first published: Thursday, September 19, 2024, 9:50 [IST]
Other articles published on Sep 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+