Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిగ్ షాక్: కీలక ప్లేయర్ అవుట్ - స్కానింగ్ రిపోర్ట్ ఇదే: బలహీన పడ్డ బౌలింగ్..!!

 SL vs NAM, T20 World Cup 2022: Dilshan Madushanka has likely been ruled out of the tournament

మెల్‌బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం వేదికగా మారింది. శ్రీలంకతో నమీబియా తలపడుతోంది. శ్రీలంక టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. నమీబియా ఇన్నింగ్ ఆరంభమైంది. రెండో ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయింది నమీబియా. చమీర బౌలింగ్‌లో మూడు పరుగులు చేసిన మైఖెల్ లింగెన్ వాన్ అవుట్ అయ్యాడు. ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

కాగా ఈ టోర్నమెంట్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ దిల్షాన్ మధుశనక గాయపడ్డాడు. ఈ టోర్నమెంట్ మొత్తం నుంచీ తప్పుకోనున్నాడు. గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డ్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఇప్పటికే భారత్ సహా వివిధ జట్ల ప్లేయర్లు గాయపడిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం వల్ల టోర్నీకి దూరం అయ్యాడు.

రిజర్వ్ ప్లేయర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న దీపక్ చాహర్ సైతం గాయంతో వైదొలిగాడు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌కు బదులుగా శార్దుల్ ఠాకూర్‌ను ఆస్ట్రేలియాకు పంపించింది బీసీసీఐ. మహ్మద్ సిరాజ్ కూడా జట్టుకు అందుబాటులోఉంటోన్నాడు. శ్రీలంక కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోన్నారు లంకేయులు. టీమిండియాకు తేరుకోవడానికి కొంత సమయమైనా దొరికింది గానీ.. శ్రీలంకకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.

శనివారం నుంచీ మధుశనక ప్రాక్టీస్‌లో పాల్గొనట్లేదు. అప్పుడే అనుమానాలొచ్చాయి గానీ శ్రీలంక మేనేజ్‌మెంట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. అతనికి ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ రిపోర్ట్ అందిన తరువాతే ఈ విషయాన్ని వెల్లడించింది. మధుశనక గాయపడినట్లు తెలిపింది. తొడ కండరాల్లో తేలికపాటి చీలక కనిపించినట్లు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కుడి తొడ కండరం చిట్లినట్లు వివరించింది.

Story first published: Sunday, October 16, 2022, 9:50 [IST]
Other articles published on Oct 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+