T20 World Cup 2022లో సంచలనం: నమీబియా చేతిలో మట్టికరిచిన ఆసియా కప్ విన్నర్..!!

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. తనకంటే ఎంతో బలమైన శ్రీలంకకు షాకిచ్చింది నమీబియా. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తరువాత బౌలింగ్‌లో అంచనాలకు అందని విధంగా రాణించింది. ఆసియా కప్ 2022 విన్నర్‌ను చిత్తు చేసింది. సూపర్ 12లో ప్రవేశించడానికి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ ఊహించని పరాజయంతో శ్రీలంక ప్రస్థానం ప్రమాదంలో పడినట్టే.

163 పరుగులు..
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్ ఆశించిన స్థాయిలో ఆరంభం కాలేదు. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. వెంటవెంటనే ఓపెనర్లు అవుట్ అయ్యారు. మైఖెల్ వాన్ లింగెన్-3, దివాన్ లా కాక్-9 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఈ రెండు వికెట్లను కూడా దుష్మంత చమీర, ప్రమోద్ మధుశంక లియగమగె తీసుకున్నారు.

కౌంటర్ అటాక్..
టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఓ మోస్తరు పోరాట పటిమను కనపరిచారు. జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ 20, స్టెఫాన్ బార్డ్-26, కేప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్-20 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ వీస్‌ది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలిబంతికే అవుట్ అయ్యాడు. 14.2 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసిన దశలో నమీబియా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు గేర్ మార్చారు. కౌంటర్ అటాక్‌కు దిగారు. లంక బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు.

చివరి అయిదు ఓవర్లల్లో..
జాన్ ఫ్రైలింక్, జొహాన్నెస్ జొనాథన్ స్మిత్.. ధాటిగా ఆడారు. లంక బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. చివరి అయిదు ఓవర్లల్లో 63 పరుగులను పిండుకున్నారంటే ఈ ఇద్దరు ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. అదే స్థాయిలో రెచ్చిపోయాడు జొనాథన్ స్మిత్ కూడా. 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

భారీ టార్గెట్..
వీరిద్దరి కౌంటర్ అటాక్‌కు నమీబియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లల్లో ప్రమోద్ మధుశంక రెండు వికెట్లు తీసుకున్నాడు. మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నె, వనిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఏ దశలో కూడా పోరాటాన్ని కనపర్చలేదు. ప్రారంభం నుంచి వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. నమీబియా బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు బ్యాటర్లు. పాథుమ్ నిశ్శంక-9, కుశాల్ మెండిస్-6, ధనంజయ డిసిల్వా-12, ధనుష్క గుణతిలక-0, భానుక రాజపక్స-20, కేప్టెన్ డాసన శనక-29, వనిందు హసరంగ-4, చమిక కరుణరత్నె-5, ప్రమోద్ మధుశంక లియానగమగె-0, దుష్మంత చమీర-8 పరుగులు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications