For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SL vs BAN: చెలరేగిన చరిత్ అసలంక, భానుక రాజపక్స.. బంగ్లాపై శ్రీలంక భారీ విజయం! రికార్డు నెలకొల్పిన షకీబ్!

SL vs BAN: Charith Asalanka 80, Bhanuka Rajapaksa 53 helps Sri Lanka beat Bangladesh


షార్జా:
టీ20 ప్రపంచకప్‌ 2021 పోటీల్లో భాగంగా ఆదివారం షార్జా మైదానంలో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శ్రీలంక బ్యాటర్లు చరిత్ అసలంక (80; 49 బంతుల్లో 5x4, 5x6), భానుక రాజపక్స (53; 31 బంతుల్లో 3x4, 3x6) అద్భుత హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. కుసల్ పెరెరా (1), అవిష్క ఫెర్నాండో (0), వనిందు హసరంగా (6) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లు నాసుమ్ అహ్మద్, షకీబ్ అల్ హసన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లా తమ క్వాలిఫైయర్ మ్యాచ్ ఫామ్ అందుకోలేకపోయింది.

అసలంక హాఫ్ సెంచరీ:

అసలంక హాఫ్ సెంచరీ:

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే నసూమ్‌ వేసిన నాలుగో బంతికి కుశాల్ పెరీరా బౌల్డ్ అయ్యాడు. ఆపై నిసాంక కూడా 24 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అసలంక ధాటిగా ఆడాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డుని పరుగెత్తించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేశాడు. అసలంకకు తోడుగా రాజపక్స హాప్‌ సెంచరీతో అదరగొట్టాడు. దాంతో లంక సునాయాస విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీబుల్ హసన్ 2, అహ్మద్‌ 2, మహ్మద్‌ సైఫ్‌ద్దీన్ 1 వికెట్లు సాధించారు.

షకీబ్ రికార్డు:

షకీబ్ రికార్డు:

ఈ మ్యాచులో బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ ఓ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిదీ పేరిట ఉన్న రికార్డును అతడు బద్దలు కొట్టాడు. అఫ్రిదీ 39 వికెట్లు పడగొట్టాడు. లసిత్ మలింగ (38) మరియు సయీద్ అజ్మల్ (36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. షకీబ్ కేవలం బంతితో మాత్రమే కాదు బ్యాటుతో కూడా రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 ఆదుకున్న నయీమ్:

ఆదుకున్న నయీమ్:

అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో లిటన్ దాస్ (16: 16 బంతుల్లో 2x4)తో కలిసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ని మొహ్మద్ నయీమ్ (62; 52 బంతుల్లో 6x4) ఘనంగా ఆరంభించారు. ఈ ఇద్దరు లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కి 5.5 ఓవర్లలో 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే దూకుడు పెంచే క్రమంలో దాస్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన షకీబ్ అల్ హసన్ (10: 7 బంతుల్లో 2x4) నిరాశపరిచాడు. దాస్, షకీబ్ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో బంగ్లా స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఆపై అఫీఫ్ హుస్సేన్ (7) కూడా ఔట్ అవ్వడంతో బంగ్లా మరిన్ని కష్టాల్లో పడింది.

 రహీమ్ హాఫ్ సెంచరీ:

రహీమ్ హాఫ్ సెంచరీ:

ఈ సమయంలో మహ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ (57; 37 బంతుల్లో 5x4, 2x6) జట్టును ఆదుకున్నారు. మిడిల్ ఓవర్లలో నిలకడగా ఆడిన రహీమ్.. స్లాగ్ ఓవర్లలో వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ముందుగా నయీమ్ హాఫ్ సెంచరీ చేయగా.. ఆపై రహీమ్ ఫిఫ్టీ బాదాడు. దాంతో బంగ్లా ఇన్నింగ్స్ కుదురుకుంది. ఇక ఇన్నింగ్స్ చివరలో కెప్టెన్ మహ్మదుల్లా (10 నాటౌట్: 5 బంతుల్లో 2x4) కూడా విలువైన పరుగులు చేశాడు. దాంతో లంక ముందు బంగ్లా 172 స్కోర్ ఉంచింది. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నె, ఫెర్నాండో, లాహిరు కుమార ఒక్కో వికెట్ మాత్రమే తీయగలిగారు. ఇక చమీర నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు.

Story first published: Sunday, October 24, 2021, 19:49 [IST]
Other articles published on Oct 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+