
ఓ మోస్తరు టార్గెట్..
ఢాకాలోని షేర్ ఎ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 257 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. హార్డ్ హిట్టర్‌గా పేరున్న ఓపెనర్ లిట్టన్ దాన్ రాణించలేకపోయాడు. సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఛమీరా బౌలింగ్‌లో డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు అయిదు పరుగులే. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ క్రీజ్‌లో పాతుకుపోయాడు.

మిడిలార్డర్‌లో సెంచరీ పార్ట్‌నర్ షిప్
వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ షకిబుల్ హసన్ కూడా త్వరగానే అవుట్ అయినప్పటికీ- ముష్ఫికుర్ రహీమ్‌తో ఇన్నింగ్‌ను నిర్మించాడు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 70 బంతుల్లో ఒక సిక్స్, ఆరు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు మూడు వికెట్లకు 99 పరుగులు. తమీమ్ ఇక్బాల్ తరువాత వచ్చిన మహ్మద్ మిథున్ కూడా ఖాతా తెరవలేకపోయాడు. 99 పరుగుల వద్దే మరో వికెట్ కూడా పడటంతో ఇక బంగ్లా జట్టు 200 కూడా చేయలేదనిపించింది.

రాణించలేని లంక బౌలర్లు..
ముష్పికర్-మహ్మదుల్లా జోడి లంక బౌలర్లకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఇద్దరూ భారీ ఇన్నింగ్ ఆడారు. సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముష్ఫికుర్ 87 బంతుల్లో 84 పరుగులు చేసి సండకన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇందులో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. చివర్లో వచ్చిన ఆతిఫ్ హొస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. ఆతిఫ్ 22 బంతుల్లో మూడు ఫోర్లతో 27, సైఫుద్దీన్ తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లతో 13 పరుగులు చేశారు. దీనితో బంగ్లా జట్టు 257 పరుగులు చేసింది. లంక టీమ్‌లో ధనంజయ డిసిల్వా ఒక్కడే రాణించాడు. 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు.

స్పిన్ మాయాజాలం..
258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. తడబడింది. ఓపెనర్లు ధనుష్క గుణతిలక, కుశాల్ పెరీరా పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్లెవరూ బంగ్లా బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. 30 పరుగుల వద్ద గుణతిలక రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయిన తరువాత.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 97 పరుగులకు అయిదుమంది అవుట్ అయ్యారు. ఏ దశలోనూ లంక జట్టు లక్ష్యం వైపు సాగలేకపోయింది. బంగ్లా బౌలర్లను ప్రతిఘటించలేకపోయింది. అయిదుమంది బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

హసరంగ ఒక్కడే..
మిడిలార్డర్‌లో వహిందు హసరంగ ఒక్కడే భారీ స్కోర్ చేశాడు. దూకుడుగా ఆడాడు. 60 బంతుల్లో అయిదు సిక్సర్లు, మూడు ఫోర్లతో 74 పరుగులు చేశాడు. నాన్ స్ట్రైకింగ్ వైపు అతనికి అండగా నిలిచే బ్యాట్స్‌మెన్ లేరు. కుశాల్ మెండిస్-24, డాసన్ శంకర-14, ఇసురు ఉడన-21 పరుగులు చేశారు. 48.1 ఓవర్లలో 224 పరుగులకు లంకేయులు చాప చుట్టేశారు. దీనితో తొలి వన్డే బంగ్లావశమైంది. 33 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ మెహదీ హసన్ మిర్జా-4, ముస్తాఫిజుర్ రెహ్మాన్-3, మహ్మద్ సైఫుద్దీన్-2, హసన్ ఒక వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












