SL vs AUS 4th ODI : సెంచరీతో మెరిసిన అసలంక.. అయినా తక్కువ స్కోరుకే శ్రీలంక, పట్టుబిగిస్తున్న ఆసీస్

ఆస్ట్రేలియాపై ఇంకో గెలుపును నమోదు చేసి సుదీర్ఘ విరామం తరువాత వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను శ్రీలంక సొంతం చేసుకోవాలని తహతహలాడుతుంది. ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయిన తరువాత బౌన్స్ బ్యాక్ అయిన శ్రీలంక.. అయిదు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో ముందంజలో ఉంది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఇవ్వాళ నాలుగో వన్డేలో బరిలోకి దిగింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30గంటలకు మ్యాచ్ ఆరంభం అయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. సెంచరీ వీరుడు అసలంక (110పరుగులు 106బంతుల్లో 10ఫోర్లు 1సిక్సర్) రాణించడంతో 258పరుగులు చేయగలిగింది.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కున్హేమన్, కమ్మిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బతీశారు. ఇక 259పరుగుల ఛేదనలో ఆసీస్ పట్టుబిగిస్తుంది. 10ఓవర్లకు 1వికెట్ల్ కోల్పోయి 45పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (0) డకౌట్ అయినా.. డేవిడ్ వార్నర్ (30పరుగులు నాటౌట్), మార్ష్ (18నాటౌట్) కుదురుకుని ఆడుతున్నారు.
సరైన ఆరంభం దక్కకున్నా..
బ్యాటింగ్లో శ్రీలంకకు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే మ్యాక్సీ బౌలింగ్లో డిక్వెల్ (1) స్టంప్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ నిశ్శాంక (13), నంబర్ 3 బ్యాటర్ కుశాల్ మెండిస్ (14)లను తక్కువ స్కోరుకే కమ్మిన్స్, మార్ష్ పెవలియన్‌కు పంపించారు. దీంతో 34పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ధనుంజయ డిసిల్వా, అసలంక ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 101పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరి జోడీని మార్ష్ విడదీశాడు. 27వ ఓవర్లో డిసిల్వా (60పరుగులు 61బంతుల్లో 7ఫోర్లు)ను ఔట్ చేశాడు.
కెప్టెన్ దసున్ షనక అనవసరంగా రనౌట్ కావడంతో..
ఇక అసలంక మాత్రం క్రీజులో మొండిగా నిలబడ్డాడు. కెప్టెన్ దసున్ షనక (4) రనౌట్ అవడంతో స్కోరు బోర్డు మందగించింది. అసలంక, షనక మధ్య మిస్ అండర్ స్టండింగ్ వల్ల ఈ వికెట్ అనవసరంగా పడింది. ఇక ఎంతో జాగ్రత్తగా ఆడిన అసలంక 45వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్న అసలంకకు ప్రేక్షకుల నుంచి భారీ అభినందనలు దక్కాయి. సెంచరీ తర్వాత మరో 10పరుగులు చేసి అసలంక ఔటయ్యాడు. డి వెల్లలాగే (19), హసరంగా (21నాటౌట్) చివర్లో కాస్త ఉపయుక్తమైన పరుగులు చేయడంతో శ్రీలంక 258పరుగులు చేసి ఆలౌట్ అయింది.

తుది జట్లు
శ్రీలంక : నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, కుసల్ మెండిస్, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్సే, మహేశ్ తీక్షణ
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications