లోపల శ్రీలంక-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్.. స్టేడియం బయట వేలల్లో ఆందోళనకారులు: హైటెన్షన్

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. వేలాదిమంది ప్రజలు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. రోజులు గడుస్తోన్నప్పటికీ.. సంక్షోభ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆందోళనకు దిగారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స భవనాన్ని సైతం ముట్టడించారు. భద్రతను సైతం లెక్క చేయలేదు. మూడంచెల భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ..అధ్యక్షుడి అధికార నివాసంలోకి దూసుకెళ్లారు.
పెద్ద ఎత్తున గుడికూడిన ఆందోళనకారులు..
ఈ పరిస్థితుల మధ్య శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య కొనసాగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. టెస్ట్ మ్యాచ్ కొనసాగకపోవచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన గాలే స్టేడియం వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు గుమికూడారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్‌గా మారాయి.

దేశాధ్యక్షుడి భవనం ముట్టడించిన కొద్దిసేపటికే..
ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికార నివాసాన్ని ముట్టడించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. తమ దేశ జాతీయ పతాకాలను చేతబట్టుకున్న లంకేయులు పెద్ద సంఖ్యలో గాలే స్టేడియం వద్దకు చేరుకున్నారు. గో హోమ్ గొటా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. స్టేడియం లోనికి చొచ్చుకెళ్లడానికి వారు ప్రయత్నించకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేసింది. టెస్ట్ మ్యాచ్ యధాతథంగా కొనసాగుతోంది.

క్రికెట్ ఆస్ట్రేలియా ఆరా..
శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ఆరా తీస్తోంది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అక్కడి పరిణామాలను అడిగి తెలుసుకుంటోంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి పాకిస్తాన్ జట్టు.. శ్రీలంకలో ఇప్పటికే అడుగు పెట్టింది. తాజాగా సంభవించిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆ జట్టు ప్లేయర్లు ఇవ్వాళ్టి తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నారు. హోటళ్లకే పరిమితం అయ్యారు.

సజావుగా మ్యాచ్..
ప్రస్తుతం శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ రెండో రోజు గేమ్ కొనసాగుతోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్ ఆడుతోంది. డ్రింక్స్ బ్రేక్ నాటికి ఒక వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది శ్రీలంక. దిముత్ కరుణరత్నె 68, కుశాల్ మెండిస్ 48 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాథమ్ నిశ్శంక ఆరు పరుగులు చేసి మిఛెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్‌లో శ్రీలంక 364 పరుగులకు ఆలౌట్ అయింది. మార్నుస్ లాంబుషెన్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో మెరిశారు. లాంబుషెన్ 104 పరుగులు చేసి జయసూర్య బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications