For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Prabath Jayasuriya: తొలి టెస్ట్‌లోనే అదరగొట్టాడు: ఆరు వికెట్లతో ఆస్ట్రేలియన్లకు చుక్కలు చూపించిన బౌలర్

SL vs AUS 2022 2nd Test match: Prabath Jayasuriya picks up six wickets on debut

కొలంబో: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. గాలె వేదికగా ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ సాధించింది. 364 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తోటి బ్యాటర్లు విఫలమైన వేళ.. టాప్ ఆర్డర్ బ్యాటర్ మర్నుస లాంబుషేన్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆదుకున్నారు. లాంబుషేన్ 104 పరుగులు చేసిన అవుట్ కాగా.. స్మిత్ మాత్రం క్రీజ్‌లో పాతుకు పోయాడు. రెండో రోజు 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆదుకున్న సెంచరీ హీరోలు..

ఆదుకున్న సెంచరీ హీరోలు..

రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజంతా ఆస్ట్రేలియా బ్యాటర్లదే ఆధిపత్యం. ఒకే రోజు రెండు సెంచరీలు నమోదు చేశారు. ఓపెనర్లిద్దరూ త్వరగా అవుట్ అయ్యారు. డేవిడ్ వార్నర్ అయిదు పరుగులకే వెనుదిరిగాడు. కసున్ రజిత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 37 పరుగులు చేసి, రమేష్ మెండిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొలి రోజు సెంచరీ హీరో లాంబుషేన్ అవుట్ అయిన తరువాత మళ్లీ వికెట్ల పతనం మొదలైంది.

వారిద్దరూ లేకుంటే..

వారిద్దరూ లేకుంటే..

ట్రవిస్ హెడ్-12, కామెరూన్ గ్రీన్-4, అలెక్స్ క్యారీ-28, మిఛెల్ స్టార్క్-1, కేప్టెన్ పాట్ కమ్మిన్స్-1, నాథన్ లియాన్-5, మిఛెల్ స్వెప్సన్-3 పరుగులు చేశారు. లాంబుషెన్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆదుకుని ఉండకపోతే ఆస్ట్రేలియా కష్టాలు మరింత పెరిగివుండేవనడంలో సందేహాలు అక్కర్లేదు. మిగిలిన బ్యాటర్లెవరూ శ్రీలంక బౌలింగ్ ధాటికి ఎదురు నిలవట్లేదు. రెండో రోజు- శ్రీలంక బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. తొలి సెషన్‌లోనే వికెట్లు పడ్డాయి.

తొలి టెస్ట్‌లోనే ఆరు వికెట్లు..

తొలి టెస్ట్‌లోనే ఆరు వికెట్లు..

తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు తన స్పిన్ మాయాజలంతో కట్టి పడేశాడు. అతని బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోన్నది ఒక్క స్టీవ్ స్మిత్ మాత్రమే. టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే ఆరు వికెట్లను నేలకూల్చాడీ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడాక్స్ బౌలర్.

ప్రభాత్ జయసూర్య రూపంలో మరో నాణ్యమైన స్పిన్ బౌలర్ శ్రీలంక జట్టుకు దొరికినట్టయింది. ఇన్నింగ్ మొత్తం మీద 36 ఓవర్లను సంధించిన ప్రభాత్.. 118 పరుగులు ఇచ్చి ఆరుమంది బ్యాటర్లను అవుట్ చేశాడు.

స్పిన్‌కు అనుకూలించేలా..

స్పిన్‌కు అనుకూలించేలా..

సెంచరీ చేసిన లాంబుషెన్‌ను తొలి రోజే వెనక్కి పంపాడు. 104 పరుగులు చేసిన లాంబుషెన్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిఛెల్ స్టార్క్, నాథన్ లియాన్‌ వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన వారిలో కసున్ రజిత-2 వికెట్లు, రమేష్ మెండిస్, మహీష్ తీక్షణ, ఒక్కో వికెట్ పడగొట్టారు. శ్రీలంక జట్టు తన రెండో ఇన్నింగ్‌ను ఇంకా ఆరంభించాల్సి ఉంది. రెండో రోజు గాలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారడం వల్ల నాథన్ లియాన్ రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదు.

Story first published: Saturday, July 9, 2022, 12:11 [IST]
Other articles published on Jul 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+