Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AFG: 6, 6,6,NB, 6,6,1.. ఒకే ఓవర్లో 32 పరుగులు (వీడియో)

SL vs AFG: ఆసియా కప్ 2025లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ ఆఖరి ఓవర్‌లో వీరవిహారం చేశాడు. తన అనుభవాన్ని రంగరించి, వరుస సిక్సర్లతో జట్టు స్కోరును అమాంతం పెంచాడు. ఒకానొక దశలో వికెట్లు పడుతున్నప్పుడు నెమ్మదిగా ఆడిన నబీ.. రషీద్ ఖాన్ దూకుడుగా ఆడుతుండగా సెకండ్ ఫిడిల్‌గా వ్యవహరించాడు. కానీ చివరి ఓవర్‌లో తన మార్క్ చూపించాడు.

అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్‌లో నబీ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. శ్రీలంక స్పిన్నర్ వెల్లాలగే వేసిన చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో వరుసగా 6, 6,6,NB, 6,6,1 తో మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు స్కోరు ఒక్కసారిగా పెరిగింది. చివరి ఓవర్ ముందు వరకు సాధారణ స్కోరుతో ఉన్న అఫ్గానిస్తాన్, నబీ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగుల పోరాడదగిన స్కోరును సాధించింది. శ్రీలంక జట్టుకు 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇది వారికి గెలుపుపై ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నబీ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని అనుభవం, ఒత్తిడిని తట్టుకుని ఆడగల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.

SL vs AFG Mohammad Nabi Smashes 32 Runs in One Over Asia Cup 2025 Thriller

శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌లో మొదట్లో అఫ్గానిస్తాన్‌ను కట్టడి చేశారు. కానీ, వారికి పెద్ద దెబ్బ తగిలింది. వెల్లాలగే, చమీర బౌలింగ్‌లో నబీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. ఈ తప్పుకు శ్రీలంక జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. నబీ ఆ తర్వాత అదే బౌలర్లపై విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. నబీ మొత్తంగా 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇబ్రహీం జద్రాన్ 24, రషీద్ ఖాన్ 24 మినహా మిగతా వారు పెద్దగా రాణించలేకపోయారు. మొదట్లో శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా తుషార అద్భుతంగా బౌలింగ్ చేసి పవర్‌ప్లేలో మూడు వికెట్లు తీసి ఆఫ్గాన్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆఫ్గానిస్తాన్ 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, నబీ, రషీద్‌లు చివరి రెండు ఓవర్లలో చేసిన విధ్వంసంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషారా 4 వికెట్లు పడగొట్టగా.. చమీరా, వెల్లాలగే, దసున్ షనక తలో వికెట్ పడగొట్టారు.

టాస్ సమయంలో రషీద్ ఖాన్ ఈ పిచ్‌పై 165 మంచి స్కోరు అని చెప్పాడు. అతని జట్టు ఇప్పుడు ఆ స్కోరును అందించింది. దీంతో శ్రీలంక బౌలర్లు షాక్‌లో ఉన్నారు. అఫ్గానిస్తాన్ సూపర్-4లోకి అడుగుపెట్టాలంటే భారీ విజయం సాధించాలి. కానీ శ్రీలంకకు గెలుపు అవసరం లేదు. కేవలం 101 పరుగులు సాధిస్తే చాలు, సూపర్-4కు అర్హత సాధిస్తారు.

Story first published: Thursday, September 18, 2025, 22:09 [IST]
Other articles published on Sep 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+