Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లైఫ్ అండ్ డెత్ గేమ్ - అంచనాలకు అతీతంగా..!!

 SL Playing 11 vs UAE: Sri Lanka look to bounce back todays match against UAE at Melbourne.

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచ కప్ 2022 అంచనాలకు అందట్లేదు. ఊహించని ట్విస్టులతో సాగుతోంది. తొలి రెండు రోజుల్లోనూ సంచలనాలు నమోదయ్యాయి. టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే నమీబియా చేతిలో శ్రీలంక ఘోరంగా ఓడిపోయింది. ఆ మరుసటి రోజే స్కాట్లాండ్.. వెస్టిండీస్‌ను మట్టి కరిపించింది. అదే సమయంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వామప్ మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది అభిమానులను. ఇవ్వాళ కూడా అలాంటి పరిణామాలే సంభవించే అవకాశాలు లేకపోలేదు.

ఈ వరల్డ్ కప్ గ్రూప్- ఏలో భాగంగా శ్రీలంక తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. మెల్‌బోర్న్ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం దీనికి వేదిక. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తొలి రౌండ్ ముగిసిన తరువాత గ్రూప్ - ఏ పాయింట్ల పట్టికలో నమీబియా అగ్రస్థానానికి చేరుకుంది. రెండో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది. అట్టడుగు స్థానానికి దిగజారింది శ్రీలంక.

శ్రీలంకకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తొలి మ్యాచ్‌లో నమీబియా ఇచ్చిన షాక్‌తో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో లంకేయుల ప్రస్థానం ప్రమాదంలో పడింది. ఫలితంగా ఇక గెలిచి తీరాల్సిన స్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గానీ తన సూపర్ 12 ఆశలను సజీవంగా ఉంచుకోలేదు. అలాంటి పరిస్థితిలో లంకేయుల పోరాటం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.

టీ20 ప్రపంచకప్ న్యూ కమ్మర్ యుఏఈనీ తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. పోరాట పటిమను ప్రదర్శించింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న నెదర్లాండ్స్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. మ్యాచ్‌ను చివరి బంతి వరకూ తీసుకెళ్లగలిగింది. చేసింది 111 పరుగులే అయినా- దాన్ని కాపాడుకోవడానికి యుఏఈ బౌలర్లు తెగింపును ప్రదర్శించారు. మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్లగలిగారంటే- యూఏఈ జట్టు బౌలింగ్ వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

శ్రీలంక తుదిజట్టులో- పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, డాసన్ షనక (కేప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక, ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. యూఏఈలో- ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, వృత్యా అరవింద్ (వికెట్ కీపర్), సీపీ రిజ్వాన్ (కేప్టెన్), చిరాగ్ సూరి, వసీమ్ మహమ్మద్, అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయ్యప్పన్, జహూర్ ఖాన్, జునైద్ సిద్ధిక్, బాసిల్ హమీద్ ఆడొచ్చు.

Story first published: Tuesday, October 18, 2022, 7:17 [IST]
Other articles published on Oct 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+