Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాట్రిక్ తో అదరగొట్టిన హెరాత్ : వందకే చాప చుట్టేసిన ఆసీస్

గాలె : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో శ్రీలంక దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా స్పిన్నర్ రంగనా హెరాత్ మ్యాజిక్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా సెంచరీ మార్క్ కు మరో ఆరు పరుగులను మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్ చాప చుట్టేసింది.

హ్యాట్రిక్ తో రెచ్చిపోయిన స్పిన్నర్ హెరాత్ వరుస బంతుల్లో ఆసీస్ బ్యాట్స్ మెన్.. ఆడమ్ వోగ్స్(8), పీటర్ నెవిల్(0), మిచెల్ స్టార్క్(0)లను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో శ్రీలంక నిర్దేశించిన 281 పరుగుల తొలి ఇన్నింగ్స్ లక్ష్యానికి మరో 187 పరుగులు వెనుకబడిపోయింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఆల్ అవుట్ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 203/7 (53.3 ఓవర్లలో) పరుగులతో కొనసాగుతోంది.

Australia skittled for 106 as Sri Lankan spinner Rangana Herath bags hattrick

హెరాత్ రికార్డు :

స్పిన్నర్ రంగనా హెరాత్ కు టెస్టు కెరీర్ లో ఇదే మొదటి హ్యట్రిక్ కాగా.. శ్రీలంక తరుపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు హెరాత్. అంతకుముందు లంక బౌలర్ నువాన్ జోయ్ సా ఈ ఘనత సాధించిన తొలి లంక బౌలర్ గా రికార్డు సాధించాడు. 1999లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో జోయ్ సా హ్యాట్రిక్ సాధించాడు.

రెండు జట్ల స్కోర్ :

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 281/10 (73.1 ఓవర్లలో)
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 106/10 (33.2 ఓవర్లలో)
శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ : 203/7 (53.3 ఓవర్లలో, బ్యాటింగ్ కొనసాగుతోంది)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+