హైదరాబాద్: ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0తో భారత్ విజయం సాధించిన కోహ్లీసేన సగర్వంగా ట్రోఫీ అందుకుంది. అయితే టీమిండియా ఇచ్చిన గ్రూప్ ఫొటోను జాగ్రత్తగా గమనించారా? అందులో రహానే, షమి, హార్దిక్ పాండ్యా, సాహా కూడా ఉన్నారు.
ఇంగ్లాండ్ సిరిస్‌కు ఎంపికైన వీరంతా మధ్యలో గాయపడి సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే జట్టు సంబరాలు చేసుకునే సమయానికి అంతా మళ్లీ చెన్నైలోని చిదంబరం స్టేడియానికి వచ్చారు. దీనికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేనని టీమ్‌లోని ఓ ఆటగాడు వెల్లడించాడు.

సిరీస్ విజయంలో అందరి పాత్ర ఉందని, గెలుపు సంబరాల్లో అందరూ ఉండాలని కోహ్లీ స్పష్టం చేయడంతో బీసీసీఐ గాయపడి ఇంటికి వెళ్లిన ఆటగాళ్లను కూడా చెన్నై రావాల్సిందిగా కోరింది. ఇది జట్టు కాదు ఓ కుటుంబం అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ పోస్టు చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంగ్లాండ్‌తో సిరిస్‌కు ఎంపికై గాయపడిన సభ్యులందరికీ చెన్నై రావాలన్న సందేశం బీసీసీఐ నుంచి వెళ్లింది. ఈ జట్టు ఓ కుటుంబంలాంటిదన్న విషయం అందరికీ తెలిసిందే కదా అని ఆ ఆటగాడు తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టు విజయంలో జట్టు సభ్యులందరినీ భాగస్వాములను చేస్తున్నాడు.
అయితే కోహ్లీ మాత్రం జట్టు గెలిచిన సందర్భాల్లోనే విజయంలో మిగతావారిని కూడా కలుపుకుపోతున్నాడు. మ్యాచ్ అనంతరం లోయర్ ఆర్డర్ బ్యాట్‌తో రాణించడమే ఈ సిరీస్ విజయానికి కారణమని కోహ్లి స్పష్టంచేశాడు. దీంతో
సిరీస్‌లో గాయపడిన వారిని విజయం అనంతరం సంబరాల్లో పాల్గొనాల్సిందిగా అహ్వానించడం క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి.