కోహ్లీ అసంతృప్తి: టీమిండియాకు ఎన్ని మార్కులేశాడో తెలుసా?
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టినా కెప్టెన్ కోహ్లీ మాత్రం అసంతృప్తిగా ఉన్నాడు. ధోని నుంచి నాయకత్వ పగ్గాలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఇది తొలి ఐసీసీ టోర్నీ.
అంతేకాదు టోర్నీలో భాగంగా భారత్ తలపడింది చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో. పాక్‌తో మ్యాచ్ అంటేనే భారత ఆటగాళ్లు కాస్తంత ఒత్తిడిలో ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్‌కి ముందు వరకు ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ తిరిగా ఫామ్‌లోకి రావడం అభిమానులు సంతోషపడాల్సిన విషయం.

పాక్‌పై 124 పరుగుల తేడాతో విజయం
ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోహ్లీ సేన పాక్‌పై 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జట్టు సహచర ఆటగాళ్లపై కోహ్లీ విమర్శలు గుప్పించాడు. టీమిండియా ప్రదర్శనపై కోహ్లీ మార్కులు వేశాడు. ఫిల్డింగ్ విషయంలో టీమిండియాకు 10 పాయింట్లకు గానూ కేవలం 6 పాయింట్లే ఇచ్చాడు.

బ్యాటింగ్‌లో 10 పాయింట్లకు గాను 10 పాయింట్లు
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టీమిండియాకు 10 పాయింట్లకు గాను 10 పాయింట్లు ఇచ్చాడు. అంతేకాదు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు రెండు, మూడు క్యాచ్‌లు నేలపాలు చేశారని, ఆపగలిగే స్థితిలో ఉన్నప్పటికీ బౌండరీలు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తదుపరి మ్యాచ్‌లో తమ ఫీల్డింగ్‌ను మరింత మెరుగు పరుచుకొంటామని చెప్పాడు.

భారత్ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా
'పాక్ జట్టులో అత్యధిక స్కోరు చేసిన అజహర్ అలీ.. భారత్ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓసారి పాండ్యా మంచి రనౌట్ చాన్స్ మిస్ చేయగా, మరోసారి భువీ అతడి క్యాచ్‌ను వదిలేశాడు. షాదబ్ ఖాన్ ఆడిన బంతిని కేదార్ జాదవ్ క్యాచ్ పట్టకపోవడం లాంటి తప్పిదాలు మరెన్నో కనిపించాయని' కోహ్లీ వివరించాడు.

యువీ మెరుపుల వల్లే టీమిండియా మెరుగైన జట్టుగా
ప్రాక్టీస్ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసిన జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజారే అవకావం ఉంటుని భారత జట్టు ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ విలువైన సూచలిచ్చాడు. యువరాజ్ సింగ్ ఆటవల్లనే ఇరుజట్లలో భారత్ మెరుగైన జట్టుగా నిలిచిందని కోహ్లీ ప్రశంసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications