హైదరాబాద్: 2007లో ఇంగ్లాండ్‌పై టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలోని ఓ లోకల్ గేమ్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసుకుని ఓ బౌలర్ అరుదైన రికార్డుని నమోదు చేశాడు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గోల్డెన్ పాయింట్ క్రికెట్ క్లబ్, ఈస్ట్ బలారట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలెడ్ కేరీ అనే బౌలర్ ఈ ఘనతను సాధించాడు. గోల్డెన్ పాయింట్ తరఫున ఆడుతున్న 29 ఏళ్ల అలెడ్ కెరీ ఎనిమిది ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే తొమ్మిదో ఓవర్‌లో రికార్డు సృష్టించాడు.

40/2 పరుగుల వద్ద తొమ్మిదో ఓవర్ వేసేందుకు అలెడ్ కెరీ కెప్టెన్ నుంచి బంతిని అందుకున్నాడు. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు ఇలా తీశాడు. దీంతో ఈస్ట్ బలారట్ జట్టు 40 పరుగులకే ఆలౌటైంది.
తొలి బంతి: స్లిప్‌లో క్యాచ్
రెండో బంతి: కీపర్ క్యాచ్
మూడో బంతి: ఎల్‌బీ
నాలుగో బంతి: బ్యాట్స్‌మెన్ క్లీన్‌బౌల్డ్
ఐదో బంతి: బ్యాట్స్‌మెన్ క్లీన్‌బౌల్డ్
ఆరో బంతి: బ్యాట్స్‌మెన్ క్లీన్‌బౌల్డ్
మిగతా ఇద్దరు బ్యాట్స్ మెన్లు కూడా ఎటువంటి పరుగులు చేయకుండా పెవిలియన్‌కు చేరారు. మ్యాచ్ అనంతరం అలెడ్ కెరీ మాట్లాడుతూ గతంలో హ్యాట్రిక్‌కు సమీపాన వచ్చాను కానీ, ఆ అదృష్టం తనకు దక్కలేదని అన్నాడు. అయితే ఇప్పుడు ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసుకోవడం తనను షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నాడు.
'మ్యాచ్‌ను వీక్షించడానికి అభిమానులు పరిమితి సంఖ్యలోనే వచ్చారు. తొలి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన అలెడ్ తర్వాతి రెండు బంతుల్లో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాడని తెలుసుకున్న ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు' అని గోల్డెన్ పాయింట్ కార్యదర్శి జాన్ ఓగ్లివ్ తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు వికెట్లు తీసిన సందర్భాలు ఇప్పటి వరకు లేవు. టెస్టుల్లో మాత్రం ఒక ఓవర్‌లో అత్యధికంగా నాలుగు వికెట్లు తీసుకున్న బౌలర్లు మాత్రమే ఉన్నారు. ఆరు బౌలర్లు ఈ ఘనతను సాధిస్తే అందులో ఐదుగురు ఇంగ్లాండ్ బౌలర్లు ఉన్నారు.
1990లో వెస్టిండిస్‌పై లాహోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ఈ ఘనతను సాధించాడు.