న్యూఢిల్లీ: వెస్టిండీస్ స్టార్ బ్యాట్సుమెన్ క్రిస్ గేల్ 'సిక్స్ మిషన్' పేరుతో ఆటో బయోగ్రాఫ్ తీసుకు వచ్చాడు. అతడు ఆ పుస్తకంలో ఎన్నో అంశాలు పేర్కొన్నాడు. ఈ పుస్తకం పేరు - సిక్స్ మిషన్. పుస్తకం రాసిన వారు - క్రిస్ గేల్. పబ్లిషర్ - పెంగ్విన్ వికింగ్. పుస్తకం ధర - రూ.599.
ఆజానుభావుడైన, లెఫ్ట్ హ్యాండర్ అయిన క్రిస్ గేల్ ట్వంటీ 20 క్రికెట్లో మరిచిపోని జ్ఞాపకాలను ఎన్నింటినో మిగిల్చాడు. ఇతను తన జీవితం, క్రికెట్ కెరీర్ గురించి ఈ పుస్తకంలో విపులంగా పొందుపర్చాడు. గేల్ తనను తాను వరల్డ్ బాస్‌గా చెప్పుకున్నాడు.
తాను ఓ అసహజమైన వాడినంటూ అతను ఈ పుస్తకాన్ని ప్రారంభించడం గమనార్హం. తన చిన్ననాటి తరం అంశాలు, క్రికెటర్‌గా ఎదిగిన విషయాలు చెప్పాడు. అంతేకాదు, క్రిస్ గేల్ ఈ పుస్తకంలో తనను పుట్‌బాల్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో, ఇబ్రహిమోవిక్‌లతో పోల్చుకున్నాడు.

క్రిస్ గేల్ క్రికెట్లో పలు రికార్డులు సృష్టించాడు. అందులో టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు చేయడం ఒకటి. టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు చేసిన నలుగురిలో గేల్ ఒకడు. అంతేకాదు, మూడు ఫార్మాట్లలోను క్రిస్ గేల్ సెంచరీలు చేశాడు.
రికార్డుల కోసం పరుగెత్తనని అందులో పేర్కొన్నాడు. కష్టపడితే రికార్డులు వాటంతట ఆవే వస్తాయని పేర్కొన్నాడు.
కొద్ది రోజుల క్రితం దుమారం రేపిన 'బ్రాష్' వివాదం పైన, తన జీవితంలో వచ్చిన వివాదాల పైన కూడా అతను పశ్చాత్తాపం ప్రకటించలేదు. అంతేకాదు, తన పైన వచ్చిన వివాదాల విషయంలో వివరణ ఇఛ్చే ప్రయత్నం చేశాడు. తన తప్పు లేదని అభిప్రాయపడ్డాడు.
ఇండియన్ ప్రీమియర్ గురించి కూడా రాశాడు. గేల్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. బెంగళూరు ఓనర్ విజయ్ మాల్యా. త్రీ వీలర్స్ హార్డీ డేవిడ్సన్ బైక్ నుంచి మొదలు పర్సనల్ థియేటర్, ఎలిపెంట్ రైడ్స్ వరకు.. పలు అంశాలను పుస్తకంలో పొందుపర్చాడు.
అంతేకాదు, బాలీవుడ్ నటులు, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, నటి జుహీచావ్లాలను కూడా ప్రస్తావించాడు.
క్రిస్ గేల్ ఐపీఎల్ ద్వారా మరింత పెద్ద హీరో అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న అతని ఆట కోసం బెంగళూరుతో పాటు అందరూ ఎదురు చూస్తుంటారు.
గేల్ తన పుస్తకంలో... ఐపీఎల్ క్రికెట్‌ను బాగా మార్చిందని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, దేశాల తరఫున అడినప్పుడు, ఐపీఎల్లో ఆడినప్పుడు.. వేర్వేరుగా... ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడాన్ని, ఒకే జెర్సీ ధరించడాన్ని ప్రస్తావించాడు.
2013 ఐపీఎల్లో క్రిస్ గేల్ 175 పరుగులు చేసినంది అందరికీ బాగా గుర్తు ఉంటుందిత. పుణే వారియర్స్ పైన బెంగళూరు అప్పుడు 130 పరుగుల తేడాతో గెలిచింది. అప్పుడు గేల్ 175 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇప్పటి వరకు ఇదే. దీని గురించి ప్రస్తావించాడు. తనకు మరింత స్ట్రైక్ వచ్చి ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడినని అభిప్రాయపడ్డాడు.
టెస్టుల్లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన వాడు క్రిస్ గేల్. అతను తన సిక్సుల ద్వారా కారు డ్యామేజ్ అయిన వారికి అతను క్షమాపణలు చెప్పాడు. ట్వంటీ 20లతో పాటు తన టెస్ట్ క్రికెట్ గురించి కూడా ప్రస్తావించాడు. 2005లో సౌతాఫ్రికా పైన 317 పరుగులు, 2010లో శ్రీలంక పైన 333 పరుగులను గుర్తు చేసుకున్నాడు.