టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో ప్రేమలో పడినట్లు జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్ పై సిరాజ్ స్పందించాడు. తామిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాడు.
రీసెంట్ గా ముంబయిలోని బాంద్రాలో లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే 23వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సిరాజ్ తో పాటు శ్రేయస్ అయ్యర్, నటుడు జాకీ ష్రాఫ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్ సహా తదితురులు పాల్గొని సందడి చేశారు. అయితే వీరిలో సిరాజ్ ప్రత్యేకంగా నిలిచాడు. ఎందుకంటే అతడు.. జనై భోస్లేతో దిగిన పిక్ వైరల్ గా మారింది. ఇందులో వీరిద్దరు సన్నిహితంగా కనిపించారు. దీంతో ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం మొదలైంది.

స్పందించిన సిరాజ్
ఈ ప్రచారం మొదలవ్వగానే వెంటనే సిరాజ్ అలర్ట్ అయ్యాడు. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని ఇన్‌స్టా స్టోరీలో స్పష్టత ఇచ్చాడు. ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. 'తనలాంటి సోదరి మరొకరు లేరు. తను లేకుండా నేను ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఎలా అయితే ఉన్నాడో.. ఆమె కూడా వెయ్యి మందిలో ఒకరు' అనే కవిత్వాన్ని రాసుకొచ్చాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొంది.