Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ చిన్నారి ఎవరో తెలిసింది: కోహ్లీ వ్యాఖ్యలపై తోషి (వీడియో)

హైదరాబాద్: సరిగ్గా రెండు రోజుల క్రితం సరిగ్గా చదవడంలేదని ఓ చిన్నారిని ఆమె తల్లి కొట్టడంతో పాటు దూషించిన వీడియోని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసి కలత చెందిన యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, రాబిన్ ఊతప్పలతో పాటు పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

అంతేకాదు పిల్లలను చదువు పేరిట ఇలా దూషించడం, హింసించడం ఎంతమాత్రం సరికాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల పట్ల ఏ సమయంలోనైనా తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో ఉండాలని, పిల్లలను చక్కగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది.

Singer Toshi Sabri Defends Viral Video of Crying Girl. She's His Niece - 'Stubborn' And Won't Study

అయితే ఈ వీడియోలో ఉన్న చిన్నారి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలో ఉన్న మూడేళ్ల చిన్నారి హయా బాలీవుడ్ సింగర్లు తోషి, షరీబ్‌ సబ్రీలకు స్వయాన మేనకోడలు. ఈ వీడియోపై గాయకుడు తోషి సబ్రీ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో హయా చాలా మొండిదని, ఎంత చెప్పినా చదువుకోదని, అందుకే ఆమె తల్లి ఇలా బలవంతంగా నేర్పిస్తుందని తెలిపాడు.

'కోహ్లీ, ధావన్‌కి మా గురించి తెలియదు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. చదువుకోమని హయాకి గట్టిగా చెప్పకపోతే మరుక్షణమే ఆడటానికి పరిగెత్తుకు వెళ్తుంది. ఆమె స్వభావం అలాంటిది. అందుకే హయాతో వాళ్ల అమ్మ అలా మాట్లాడాల్సి వచ్చింది. హయా నర్సరీ చదువుతోంది. నంబర్లు నేర్చుకోమని వాళ్ల టీచర్‌ ఆమెకి హోమ్‌ వర్క్‌ ఇచ్చారు. అందుకే హయా కొంతసేపైనా చదువుకొనేలా చూస్తాం' అని అన్నాడు.

'హయా ఎంత మొండిదో భర్తకు, సోదరులకు చూపించేందుకు ఆమె తల్లి ఈ వీడియోను చిత్రీకరించింది. తల్లి చదువుకోమని చెప్పినంతసేపు హయా ఏడుస్తోంది. చదువు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తుంది. సోషల్‌మీడియాలో ఈ వీడియో ఇంత వైరల్‌ అవుతుందని మేము అనుకోలేదు. ఈ వీడియో చూసి ఎవరన్నా అసహనం వ్యక్తం చేస్తే ఆ చిన్నారి తల్లే కదా ముందు బాధపడేది' అని పేర్కొన్నాడు.

'ప్రతి ఇంట్లో పిల్లలు ఒక్కోలా ప్రవర్తిస్తారు. మా చిన్నారి కాస్తా మొండిది. ఒక్క వీడియో చూసి తల్లి ప్రేమను ఎలా అంచనా వేయగలరు. తల్లిదండ్రులు ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూ రెండు రకాల బాధ్యతలు వహించాలి. ఇవి బ్యాలెన్స్‌ చేసుకునే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు చోటు చేసుకుంటాయి. కానీ... చిన్నారి హయా అంటే మాకు ఎంతో ఇష్టం' అని తోషి వివరణ ఇచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+