పాట పాడిన సచిన్: ఫ్యాన్స్‌కు పూనకం, 23న డాక్యుమెంటరీ ప్రసారం
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సింగర్ అయ్యాడు. సోషల్ మీడియాలో సచిన్ వీడియోని చూసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు. బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో కలిసి గొంతుకలిపారు. ఇండియన్ ఐడల్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సచిన్ 'క్రికెట్ వాలే బీట్' పేరుతో ఒక ఆల్బమ్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.
ఆ ఆల్బమ్‌లో సచిన్ అక్కడక్కడా కొన్ని పదాల వరకే పాడాడు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడాడు. 'ఆరు వరల్డ్ కప్‌లలో నాతోపాటు ఎందరో ఆడారు. వారందరికీ ఈ పాట అంకితం. దేశంలోని ప్రతి అభిమానిని ఈ పాట అలరిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
అభిమానులు సంతోషం
సోనూ నిగమ్‌తో కలిసి సచిన్ పాట పాడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ వీడియోని చూసిన వారంతా అభినందిస్తున్నారు. సచిన్‌పై ట్వీట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌లో నిలిచిపోయిన 2011 ప్రపంచకప్ విజయాన్ని ఆధారంగా చేసుకుని ‘లిటిల్ మాస్టర్' అనే డాక్యుమెంటరీ తయారైంది.
ఏప్రిల్ 23న సోనీ ఈఎస్‌పీఎన్ చానెల్‌లో ప్రసారం
దీనిని ఏప్రిల్ 23న సోనీ ఈఎస్‌పీఎన్ చానెల్‌లో ప్రసారం చేయనున్నారు. సచిన్ టెండూల్కర్ 44వ పుట్టినరోజుని పురస్కరించుకుని దీనిని రూపొందించారు. భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన సచిన్‌కు ప్రపంచకప్‌తో వీడ్కోలు పలికేముందు ఆటగాళ్లు భావోద్వేగానికి గురైన తీరుని అభిమానులకు ఇందులో చూపించనున్నారు.
సచిన్‌తో గడిపే అవకాశం వచ్చింది
‘భారతలో సచిన్‌ను ఆరాధించే అభిమానులు ఒక గొప్ప స్టోరీని గుర్తు చేసుకుని పండుగ చేసుకుంటారు. నేను చాలా అదృష్టవంతున్ని. కొంత సమయం సచిన్‌తో గడిపే అవకాశం వచ్చింది. 2011 వరల్డ్ కప్ జట్టులో సచిన్‌తో కలిసి పయనించిన తీరును సహచర ఆటగాళ్లు వివరించారు' ఈ డాక్యుమెంటరీని రూపొందించిన గౌతమ్ చోప్రా తెలిపాడు.
1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం
1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం వంద సెంచరీలను సాధించాడు. 1989 నుంచి 2013 వరకు 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications