Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది మరిచిపోలేని ట్రిప్‌.. థాంక్యూ మహీ భాయ్‌: స్టార్ సింగర్

Singer Jassie Gill Thanks MS Dhoni, Sakshi For Hosting An Unforgettable Trip

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ ఇటీవలి కాలంలో క్రికెట్ ఆటతో కన్నా.. ఇతర విషయాలలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రపంచకప్‌ 2019 అనంతరం మళ్లీ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో రిటైర్మెంట్ అంటూ అనేక వార్తలు వచ్చాయి. మధ్య మధ్యలో కూతురు జీవాతో గడపిన ఫొటోలు, కొందరి ఆటగాళ్లకు రాంచీలోని తన ఇంటిలో ఆతిధ్యం ఇవ్వడం, బర్త్‌డే వేడుకలలో పాల్గొనడం వంటి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచాడు.

తాజాగా ధోనీ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ధోనీ మాత్రం ఫొటోలు షేర్ చేయలేదు. పంజాబీ ప్రముఖ గాయకుడు జాస్సీ గిల్‌.. మహీకి సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ అయ్యాయి. తాజాగా ధోనీ, ఆయన భార్య సాక్షి జాస్సీ గిల్‌తో కలిసి ఆనందంగా గడిపారు. వీరంతా కలిసి ఓ ట్రిప్‌కి వెళ్లారు. 'మీ కుటుంబంతో గడిపిన క్షణాలు అద్భుతం. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు మహీ భాయ్‌-సాక్షి. మా గ్యాంగ్‌కు మరిచిపోలేని ట్రిప్‌' అంటూ జేసీ గిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

జాస్సీ గిల్‌ పూర్తి పేరు జస్దీప్‌ సింగ్‌ గిల్‌. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 'అల్లా వే' పాటతో జాస్సీ గిల్‌ చాలా పాపులర్ అయ్యాడు. గిల్‌కు మహీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఇటీవలే 31వ సంతంలోకి అడుగుపెట్టిన గిల్‌.. తన బర్త్‌డే ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోనీ సతీమణి సాక్షి కూడా ఉన్నారు.

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ అనంతరం తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. అయితే ప్రపంచకప్‌ అనంతరం ధోనీ రిటైర్మెంట్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. చివరకు తన రిటైర్మెంట్‌పై మహీ స్పందించాడు. పునరాగమనం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...'జనవరి వరకు నన్ను ఏం అడగొద్దు' అని స్పష్టంగా చెప్పాడు. దీంతో జనవరి వరకు ధోనీ రిటైర్మెంట్‌ ఊహాగానాలకు తెరపడినట్టే. అయితే టీ20 ప్రపంచకప్‌లో ఆడుతాడో లేదో స్పష్టమైన సమాచారం అయితే లేదు.

Story first published: Wednesday, December 4, 2019, 16:44 [IST]
Other articles published on Dec 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+