న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సింగపూర్

Singapore script history by registering maiden win against an ICC Full Member nation

హైదరాబాద్: ఆదివారం సింగపూర్ క్రికెట్ జట్ట చరిత్ర సృష్టించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సింగపూర్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ)లో పూర్తి సభ్యత్వం కలిగిన దేశంపై సింగపూర్ తొలి విజయాన్ని నమోదు చేసినట్లైంది.

మ్యాచ్‌కి ముందు వర్షం పడటంతో 18 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సింగపూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. సింగపూర్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. ఓపెనర్లు రోహాన్ రంగరాజన్(22 బంతుల్లో 39), సురేంద్రన్ చంద్రమోహాన్(23) పరుగులతో చక్కటి శుభారంభాన్నిచ్చారు.

ఫెదరర్ ఎఫెక్ట్: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకు భారత ఆటగాడుఫెదరర్ ఎఫెక్ట్: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకు భారత ఆటగాడు



అయితే, వీరిద్దరూ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు చేరడం... అనంతరం క్రీజులోకి వచ్చిన అరిత్రా దత్తా(7) ఔటై నిరాశపరిచాడు. అయితే, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ టిమ్‌ డేవిడ్‌(41), మన్‌ప్రీత్‌ సింగ్‌(41)లు అద్భుత ప్రదర్శనతో సింగపూర్ సత్తా విసరగల స్కోరుని బోర్డుపై ఉంచింది. అనంతరం 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది.

జింబాబ్వే ఆటగాళ్లలో కెప్టెన్‌ సీమ్‌ విలియమ్స్‌(66), ముటోంబోడ్జి(32)లు రాణించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సింగపూర్‌ బౌలర్లలో మహబూబ్‌, జనక్‌ ప‍్రకాశ్‌ తలో రెండు వికెట్లు సాధించగా, విజయ్‌ కుమార్‌, గోపీనాథ్‌ ఆచర్‌లు చెరో వికెట్‌ తీశారు. తాజా విజయంతో ముక్కోణపు టీ20 సిరిస్‌లో సింగపూర్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.

Story first published: Monday, September 30, 2019, 12:49 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X