ఎంఎస్ ధోనీ గురించి ఆ విషయం చాలా మందికి తెలియదు: అంపైర్‌ టౌఫెల్‌

సిడ్నీ: కెరీర్‌లో తాను చూసిన అత్యంత తెలివిగల ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒకరని ప్రముఖ ఆస్ట్రేలియా మాజీ అంపైర్‌ సైమన్‌ టౌఫెల్‌ పేర్కొన్నారు. ధోనీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు షేన్‌ వార్న్‌, డారెన్‌ లెహ్మన్‌లు కూడా తెలివిగల వారని టౌఫెల్‌ చెప్పారు. న్యూ సౌత్ వేల్స్‌ కు చెందిన సైమన్‌ టౌఫెల్‌.. 24 సంవత్సరాల వయసులో అంపైరింగ్ కెరీర్ ప్రారంభించారు. ఇప్పటికే అతడు 29 ఏళ్ల కెరీర్ పూర్తిచేసారు. అత్యంత విజయవంతమైన అంపైర్‌లలో టౌఫెల్‌ ఒకరు.

అత్యంత తెలివిగల ఆటగాడు

అత్యంత తెలివిగల ఆటగాడు

తాజాగా అంపైర్‌ సైమన్‌ టౌఫెల్ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'భారత ఆటగాడు ఎంఎస్ ధోనీని అద్భుతమైన వ్యక్తిగా పరిగణిస్తా. క్రికెట్‌లో నేను చూసిన వారిలో అత్యంత తెలివిగల ఆటగాడు. అలాగే డారెన్‌ లెహ్మన్‌, షేన్‌ వార్న్‌ కూడా తెలివిగల వాళ్లే. ఇక మహీ విషయానికి వస్తే.. అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటాడు. అయితే అతడిలో మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉంది. చాలా మంది దాన్ని చూడలేరు. ఆ విషయం చాలా మందికి తెలియదు' అని అన్నారు.

భారత్ నుంచి ఒక్క అంఫైర్ కూడా

భారత్ నుంచి ఒక్క అంఫైర్ కూడా

గతేడాది వరకు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్క అంఫైర్ కూడా లేని సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులో భారత దేశం నుంచి ప్రపంచస్థాయి అంపైర్‌ ఒక్కరైనా వస్తారని అనుకోవడం లేదని అంపైర్‌ సైమన్‌ టౌఫెల్ గతంలో అభిప్రాయపడ్డారు. తాజాగా ఎస్‌ రవి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2012లో అంఫైరింగ్‌కు వీడ్కోలు పలికిన టౌఫెల్.. అక్టోబర్ 2015 వరకు ఐసీసీ అంపైర్ ఫెర్పామెన్స్ అండ్ ట్రైనింగ్ మేనేజర్‌గా కొనసాగారు.

సాధన మొదలెట్టిన మహీ

సాధన మొదలెట్టిన మహీ

మరోవైపు వచ్చేనెలలో యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌ జరగనుండటంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ తిరిగి సాధన మొదలుపెట్టాడు. లాక్‌డౌన్‌ కన్నా ముందు చెన్నై జట్టు చిదంబరం స్టేడియంలో ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏడాదిగా కాలంగా ఆటకు దూరమైన ధోనీ మార్చిలో నిర్వహించిన శిబిరంలో బాగా కష్టపడ్డాడని, ఈ సారి ఐపీఎల్‌లో చెలరేగాలని నిర్ణయించుకున్నాడని ఇటీవల తన సహచరులు పేర్కొన్నారు.

15 నుంచి ప్రాక్టీస్

15 నుంచి ప్రాక్టీస్

ఈనెల 15 నుంచి ఎంఎ చిదంబరం స్టేడియంలో సీఎస్‌కే ఆటగాళ్లు ఓ వారం రోజుల పాటు ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి సాధించింది. ఈ క్యాంపులో ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌, పియూష్‌ చావ్లా తదితర స్వదేశీ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరంతా ఈనెల 14నే చార్టర్డ్‌ ఫ్లయిట్స్‌లో చెన్నై చేరుకోనున్నారు. తర్వాతి రోజు నుంచి చెపాక్ స్టేడియం నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నారు.

నైట్ రైడర్స్ కెప్టెన్‌గా పొలార్డ్.. పూర్తి జట్టు ఇదే!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 10, 2020, 13:14 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X