ఒక్క డకౌట్‌తో మారిన సీన్.. బుడ్డోడికి స్ట్రాంగ్ వార్నింగ్!
భారత క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2026లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత సీజన్లో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే వేసిన బంతికి వైభవ్ సూర్యవంశీ ఔట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఒక్క వైఫల్యం తర్వాత వైభవ్ చుట్టూ ఉన్న పరిస్థితులపై న్యూజిలాండ్ మాజీ దిగ్గజం సైమన్ డల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
డబ్బు, కీర్తిపై సైమన్ డల్ ఆందోళన
ఓ చర్చా కార్యక్రమంలో సైమన్ డల్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ప్లేయర్ల చుట్టూ తిరిగే మేనేజ్మెంట్ కంపెనీల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. "వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఓ సూపర్ స్టార్ అయిపోయాడు. భారత క్రికెట్‌లో వైభవ్ తదుపరి పెద్ద స్టార్ అవుతాడనడంలో సందేహం లేదు. కానీ 15 ఏళ్ల వయసులో వచ్చే విపరీతమైన డబ్బు, కీర్తి ఎవరినైనా తప్పుదోవ పట్టించగలవు. ముఖ్యంగా అతని చుట్టూ ఉండే వ్యక్తుల విషయంలో వైభవ్ చాలా అప్రమత్తంగా ఉండాలి" అని మాజీ దిగ్గజం సైమన్ డల్ హెచ్చరించాడు.

కంపెనీల స్వార్థం
చాలా మేనేజ్మెంట్ కంపెనీలు ఆటగాళ్ల కెరీర్ కంటే తమ లాభాలకే ప్రాధాన్యత ఇస్తాయని సైమన్ డల్ విమర్శించాడు. "ఈ యువ ఆటగాడి ద్వారా ఎంత సంపాదించవచ్చు? మా కంపెనీకి ఎంత లాభం వస్తుంది? అనేదే వారి ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ కంపెనీలతో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే. వారు ఆటగాడిని కేవలం ఓ ఆదాయ వనరుగా చూస్తారు తప్ప, అతని కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దాలి? అనే దానిపై శ్రద్ధ పెట్టరు" అని సైమన్ డల్ ఘాటుగా విమర్శించాడు.
కెరీర్ ముఖ్యం.. ప్రకటనలు కాదు
వైభవ్ సూర్యవంశీ తన కెరీర్ సుదీర్ఘంగా సాగేలా చూసుకోవాలని.. కేవలం ప్రకటనల వెంట పడకూడదని సైమన్ డల్ సూచించాడు. "ఒకవేళ మీరు రేపు ప్రదర్శన చేయడం ఆపేస్తే.. ఈ మేనేజర్లు వెంటనే మరో ఆటగాడి వెనక్కి వెళ్తారు. కాబట్టి ఎవరితో కలిసి పని చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి. కుటుంబం అండగా ఉంటే వైభవ్ ఈ ఒత్తిడిని అధిగమించగలడు. కానీ బయటి వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి" అని సైమన్ డల్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications