For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ చెత్తను కోహ్లి ఎందుకు పట్టించుకుంటున్నాడు?- మాజీ క్రికెటర్

స్ట్రైక్ రేటు గురించి వస్తున్న విమర్శలకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాల్సిన అవసరం లేదని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అన్నాడు. కోహ్లి దూకుడుగా ఆడట్లేదేని, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవట్లేదని కొందరు మాజీ క్రికెటర్లు విమర్శించిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం దీనిపై కోహ్లి నేరుగా రియాక్ట్ అయ్యాడు.

''చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్‌రేటు గురించి, స్పిన్‌లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. కానీ నా పరంగా జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యం.15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. నా దృష్టిలో.. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం సరికాదు'' అని కోహ్లి తనపై వస్తున్న విమర్శలకు కాస్త ఘూటుగా బదులిచ్చాడు.

Simon Doull Questions Why is Kohli Bothering to Read Rubbish

అయితే ఇలాంటి విషయాలను కోహ్లి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నాడనిపిస్తుందని అన్నాడు. ''విమర్శలపై కోహ్లి రియాక్ట్ అవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ స్ట్రైక్‌రేటుపై వస్తున్న ప్రశ్నలా? కాదా? అనేది ముఖ్యం కాదు. కోహ్లి సోషల్ మీడియాను చూస్తున్నాడు. లేదా సోషల్ మీడియాలో జరిగే విషయాలని కోహ్లికి ఎవరో చెబుతున్నారు''

''పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కోహ్లి తరుచూగా ఇలాంటి విషయాల్లో రియాక్ట్ అవుతున్నాడు. అతని గురించి రాసే వార్తలకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? అతను ఓ మంచి ప్లేయర్. ఇలాంటి చెత్త విషయాలను, వార్తలను ఎందుకు పట్టించుకుంటున్నాడు? లేదా ఎవరైనా ఈ విషయాలన్ని అతనికి ఎందుకు చెబుతున్నారు? సోషల్ మీడియాలో ఉండే విషయాలను ఇంటర్వ్యూలో కోహ్లి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? కోహ్లి సోషల్ మీడియాను చూసే బదులుగా వేరే పనులు చేయడం మంచిది'' అని సైమన్ డౌల్ అన్నాడు.

Simon Doull Questions Why is Kohli Bothering to Read Rubbish

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి (51; 43 బంతుల్లో) ఆడిన ఇన్నింగ్స్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్స్ తీస్తూ కోహ్లి చాలా నిదానమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గవాస్కర్ విమర్శించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాటుతో పాటు మాటలతోనూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ వేశాడు. 44 బంతుల్లో అజేయంగా 70 పరుగులు సాధించి విరాట్.. స్పిన్‌లో 34 బంతుల్లోనే 61 పరుగులు బాదాడు.

Story first published: Thursday, May 2, 2024, 15:18 [IST]
Other articles published on May 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+