For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sikandar Raza : విరాట్ కోహ్లీ ఓ ట్రెండ్ సెట్టర్.. ఆ విషయంలో అందరూ అతన్ని అనుసరిస్తున్నారు

Sikandar Raza Opined that Virat Kohli is a Trend Setter and He is Phenomenol in Fitness

ప్రస్తుతం జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రాజా మంచి ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. అతన్ని విరాట్ కోహ్లీ గురించి ఓ రిపోర్టర్ అడగ్గా చాలా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. బాక్సింగ్లో మహమూద్ అలీ, గోల్ఫ్‌లో టైగర్ వుడ్స్‌ ఎంతటి ప్రత్యేకమైన ప్లేయర్లో.. క్రికెట్లో విరాట్ కోహ్లీ అంతే ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాడు. ఇక 36ఏళ్ల సికిందర్ రాజా.. పాకిస్థాన్‌‌కు చెందినవాడైనప్పటికీ.. జింబాబ్వేకు వాళ్ల కుటుంబం వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడ్డాడు. ఇక కోహ్లీ గురించి మాట్లాడుతూ.. క్రికెట్లో కోహ్లీ కొన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చాడని, ప్రస్తుతం క్రికెటర్లందరూ వాటిని అనుసరించేలా ఓ ట్రెండ్‌ సెట్ చేశాడని కూడా పేర్కొన్నాడు. 'విరాట్ భాయ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్.

నేను టైగర్ వుడ్స్, ముహమ్మద్ అలీ వంటి దిగ్గజాల పేర్ల సరసన విరాట్‌ కోహ్లీని పేర్కొంటా. వీళ్లు తమ తమ క్రీడలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వారు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలను ఆలోచించారు. వారు వాటిని అనుసరించారు. కొత్తగా ప్రయత్నించారు. వాళ్లు నెలకొల్పినదాన్ని తక్కిన వారందరూ ఆయా క్రీడల్లో అనుసరించారు' అని రాజా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Sikandar Raza Opined that Virat Kohli is a Trend Setter and He is Phenomenol in Fitness

క్రికెట్ అంటేనే ఫిట్‌నెస్ చాలా కీలకమైన విషయం. యంగర్ జెనెరేషన్ అనుసరించడానికి విరాట్ క్రికెట్లో ఫిట్ నెస్ స్థాయిలను ఓ లెవల్‌కు చేర్చాడు. అతను ఫిట్ నెస్ విషయంలో చూపిన చొరవ దాని బ్లూ ప్రింట్ తర్వాతి తరానికి అందించిన విధానం ప్రశంసనీయం. ప్రస్తుతం ఫిట్ నెస్ పరంగా ఇంతటి ప్రాముఖ్యత రావడంలో క్రెడిట్ అంతా కోహ్లీదే' అని రాజా అన్నారు.

MS Dhoni నే కాదు ఎవ్వడైనా ఒక్కటే,ఆ రూల్ పాటించాల్సిందే *Cricket | Telugu OneIndia

ఇక ప్రస్తుతం కెరీర్‌లో పేలవ ఫాం ఎదుర్కొంటున్న కోహ్లీకి ఏదైనా సలహా ఇస్తారా అని సికిందర్ రాజాను అడగగా రాజా స్పందిస్తు.. 'నేను కోహ్లీ లాంటి వ్యక్తికి సజెషన్ ఇవ్వడమా.. కెరీర్‌లో 16-20వేల పరుగులు చేసిన క్రికెటర్‌కు నేనేం చెప్పగలను. అతనికి ఏమీ చెప్పలేను. కొన్నాళ్లు విరాట్‌కు శాంతి కలిగేలా చూడండి. అతనికి సలహా ఇచ్చేంత అనుభవం నాకు లేదు. అతను మళ్లీ తన పీక్ ఫామ్ అందుకుంటాడు.' అని రాజా చెప్పాడు. టీ20ప్రపంచ కప్‌ తన టైటిల్ ఫేవరెట్ జట్లలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ భారత్‌ ఉన్నాయని రాజా చెప్పాడు.

Story first published: Sunday, August 14, 2022, 17:27 [IST]
Other articles published on Aug 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+