న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి: క్షమాపణలు చెప్పిన సికిందర్ రాజా

By Nageshwara Rao
Sikandar Raza apologises for Zimbabwes World Cup woe

హైదరాబాద్: జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రాజా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపాడు. ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా యూఏఈతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ఆడాలన్న జింబాబ్వే ఆశలు ఆవిరయ్యాయి. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచ కప్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. గురువారం యుఏఈతో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్ కొడితే జింబాబ్వే గెలిచేదే, కానీ క్రీజులో ఉన్న ఇర్విన్ 2 పరుగులే చేయడంతో జింబాబ్వే ఓడిపోయింది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా జింబాబ్వే లక్ష్యాన్ని 40 ఓవర్లలో 230కి కుదించారు. జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ (80) రాణించినా, మిగతా ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 226/7కే పరిమితమైంది.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో 3-41, బ్యాటింగ్‌లో 26 బంతుల్లో 34 పరుగులు చేసిన సికిందర్ రాజా జింబాబ్వే జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను క్షమాపణ కోరాడు.

గతంలో రెండు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన వెస్టిండిస్ జట్టు క్వాలిఫయిర్స్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ఇప్పటికే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. మిగిలిన ఒక స్థానం కోసం అఫ్గానిస్తాన్, ఐర్లాండ్‌ జట్లు పోటీ పడుతున్నాయి. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ విజేత వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది.

Story first published: Friday, March 23, 2018, 18:32 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X