Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టన్నింగ్ క్యాచ్: కౌల్ చేతుల్లో.. కుల్దీప్ బంతి

Siddarth Kaul's Stunning Catch Sends Ben Stokes Walking
 Siddarth Kaul’s stunning catch sends Ben Stokes walking; watch video

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో రెండో సిరీస్ ఆడుతున్న టీమిండియా మొదటి వన్డేను విజయవంతంగా ముగించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు సిద్దార్థ్‌ కౌల్‌ పట్టిన ఓ క్యాచ్‌ గురించే ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. కుల్‌దీప్‌ మణికట్టు మాయాజాలానికి రాయ్‌, రూట్‌, బెయిర్‌స్టోలను పెవిలియన్‌కు పంపాడు. చాహల్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ కూడా ఔటయ్యాడు. దీంతో మైదానంలో స్టోక్స్‌, బట్లర్‌ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడారు. స్టోక్స్‌ అర్ధ సెంచరీ చేయడానికి 100 బంతులు పైనే తీసుకున్నాడు.

జట్టు స్కోరు 214 పరుగుల వద్ద 45వ ఓవర్‌ వేసేందుకు కుల్‌దీప్‌ మరోసారి బంతిని అందుకున్నాడు. ఆ ఓవర్లో కుల్‌దీప్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్టోక్స్‌(50; 103 బంతులు) కొట్టిన రివర్స్‌ స్వీప్‌ షాట్‌ను కౌల్‌ గాల్లోకి ఎగిరి మరీ పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అంతేకాదు వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా కుల్దీప్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఇంగ్లాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గా కూడా అరుదైన ఘనత సాధించాడు.

'స్టన్నింగ్‌ క్యాచ్‌; కౌల్‌.. వాట్‌ ఏ క్యాచ్‌' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సిద్దార్థ్‌ కౌల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పాటు కుల్‌దీప్‌ యాదవ్‌ దక్కించుకున్న ఆరు వికెట్లకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం సాయంత్రం లార్డ్స్ స్టేడియం వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, July 17, 2018, 16:24 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+