For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు సిద్ధార్థ్ కౌల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

Siddarth Kaul becomes owner of this forgettable record

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌ను అద్భుతంగా ఆరంభించిన సిద్దార్థ్ కౌల్.. సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి పది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టడంతోపాటు భువీ లేని లోటును పూడ్చాడు. దీంతో అతడికి ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో పర్యటించే భారత జట్టులో చోటు దక్కింది. ఇదిలా ఉండగా ద్వితియార్థంలో అతడి ఆటతీరు గాడి తప్పింది. ప్రత్యర్థి జట్లకు భారీగా పరుగులు అప్పజెప్పే పరిస్థితి నెలకొంది.

మే 8న సిద్దార్థ్ కౌల్‌కి భారత జట్టులో పిలుపు రాగా.. తర్వాతి మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసినప్పటికీ.. ధారాళంగా పరుగులిచ్చాడు. చెన్నైతో జరిగిన ఫైనల్లో మూడు ఓవర్లు వేసిన కౌల్ 43 పరుగులు ఇచ్చుకున్నాడు. మే 8 తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో 40కిపైగా పరుగులు ఇచ్చిన కౌల్.. మరో రెండు మ్యాచ్‌ల్లో 30కిపైగా పరుగులు ఇచ్చాడు.

ఈ సీజన్లో 17 మ్యాచ్‌ల్లో 547 పరుగులు ఇచ్చుకున్నాడు. తద్వారా ఒక ఐపీఎల్ సీజన్లో ఎక్కువ పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో బ్రావో 533 పరుగులు ఇచ్చుకున్నాడు. అంతకు ముందు 2013లో ఉమేష్ యాదవ్ 508 రన్స్ సమర్పించుకున్నాడు.

ఈ విషయంపై గవాస్కర్ .. 'కౌల్ బంతిని వేగంగా విసిరేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ కమ్రంలోనే ధారాళంగా పరుగులిస్తున్నాడు. దీన్ని సరిదిద్దుకోకపోవడం వల్లే అతడికి భారత జట్టులో చోటు దక్కలేదని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, May 28, 2018, 13:03 [IST]
Other articles published on May 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+