ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా న్యూజిలాండ్ తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్... రోహిత్ తో కాకుండా మరో ప్లేయర్ కెప్టెన్సీలో కివీస్ తో తలపడనున్నట్లు తెలిసింది. మరి ఆ కెప్టెన్ ఎవరు? అసలు ట్రైనింగ్ సెషన్ లో రోహిత్ శర్మకు ఏమైంది? ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పుడు ఆదివారం( మార్చి 2) న్యూజిలాండ్ తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే రీసెంట్ గా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ పిక్కల నొప్పతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే కాసేపు విశ్రాంతి తీసుకుని ఆడాడు.

ట్రైనింగ్ సెషన్ లో రోహిత్ కు ఏమైంది?
పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ కు ముందు టీమిండియా ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. కానీ ఈ నెట్ ప్రాక్టీస్ సెషన్ లో నొప్పి కారణంగా రోహిత్ పాల్గొనలేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో మాట్లాడి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ కూడా అందుబాటులో ఉండకూడదని రోహిత్ నిర్ణయించుకున్నాడట.
ఎందుకుంటే మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడనుంది. ఒకవేళ నొప్పితోనే రోహిత్.. న్యూజిలాండ్ మ్యాచ్ లో పాల్గొంటే సెమీస్ మ్యాచ్ కు మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా సెమీస్ కోసం.. రోహిత్ కివీస్ తో మ్యాచ్ కు దూరం కానున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే కివీస్ మ్యాచ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్‌మన్ గిల్ తాత్కాలిక సారథ్య బాధ్యతలు చెపట్టే అవకాశం ఉందని తెలిసింది.
కివీస్ మ్యాచ్ కు పంత్ ఎంట్రీ..
వాస్తవానికి గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్లీ అది నిజం కాదని కూడా తెలిసింది. ఒకవేళ కివీస్ తో మ్యాచ్ కు నిజంగానే రోహిత్ దూరమైతే.. గిల్ కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే సమయంలో పంత్ కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండొచ్చు. కాగా, గ్రూప్- ఏ నుంచి న్యుజిలాండ్, టీమిండియా సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.
📸📸 Prepping 🆙 for #NZvIND 👌👌#TeamIndia | #ChampionsTrophy pic.twitter.com/YpL0V6aCKw
— BCCI (@BCCI) February 27, 2025
— BCCI (@BCCI) February 27, 2025