For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిల్ వర్సెస్ పాండ్యా.. టెస్ట్ కెప్టెన్‌గా మారిన వెంటనే ఇంత అహంకారమా? (వీడియో)

Shubman Gill vs Hardik Pandya: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు పోరాటం చేసినప్పటికీ ముంబై ఇండియన్స్‌పై గెలవలేకపోయింది. శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో గుజరాత్ టైటాన్స్ 20 పరుగులు తేడాతో ఓడిపోయింది. 229 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ 6 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ మధ్య చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్‌లో టాస్ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన అందరినీ ఆలోచించేలా చేసింది. టాస్ సమయంలో హార్దిక్ పాండ్యాతో కరచాలనం చేయకుండా శుభ్‌మన్ గిల్ ముందుకు కదిలాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కొరవడిందని సోషల్ మీడియాలో అభిమానులు చర్చిస్తున్నారు.

ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ సమయంలో హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ మధ్య కరచాలనం కూడా సరిగ్గా జరగలేదని.. ఇద్దరూ ఒకరినొకరు చూసి చూడనట్లు వ్యవహరించాలని నెట్టింట పోస్టులు వెలుగులోకి వచ్చాయి. టాస్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా ముందుకు వెళ్లగా.. గిల్ అటువైపు చూడకుండా వెళ్లిపోయాడని.. పాండ్యా కరచాలనం కోసం చేయి అందించినా శుభ్‌మన్ గిల్ గమనించలేదని అభిమానులు వీడియోలతో సహా షేర్ చేశారు. ఈ క్రమంలో ఇరు కెప్టన్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొరవడిందని పలువురు అభిప్రాయపడ్డారు. గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇలాంటి వాతావరణం నెలకొనడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఔటైన సందర్భంలో హార్దిక్ పాండ్యా వేడుకలు జరుపుకున్న విధానం వారిద్దరి మధ్య ఉన్న సంబంధం మునుపటిలా లేదని అనుమానం కలిగించింది.

Shubman Gill vs Hardik Pandya Tension at Toss Sparks Ego Clash Rumors IPL 2025 Eliminator

ఈ సంఘటనపై అభిమానులు రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిని కొందరు ఈగో క్లాష్ గా అభివర్ణిస్తుండగా.. ఇంకొంతమంది నాకౌట్ మ్యాచ్ లో ఒత్తిడి కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మైదానంలో ఆటగాళ్ల మధ్య ఇలాంటివి సర్వసాధారణమని కొట్టిపారేస్తున్నారు. ఇంకొంత మంది టెస్ట్ కెప్టెన్సీ రాగానే ఇంత అహంకారమా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గతంలో హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడేవారు. సన్నిహిత స్నేహితులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును విడిచిపెట్టిన ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ముంబై జట్టును నడిపిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ ఇప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టులోనే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా తర్వాత గుజరాత్ ఫ్రాంచైజీ శుభ్‌మన్ గిల్ పై నమ్మకం వ్యక్తం చేసింది. గత సంవత్సరం గిల్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన అంత బాగా లేదు. కానీ ఈ సంవత్సరం గిల్ పర్యవేక్షణలో జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది.

Story first published: Saturday, May 31, 2025, 15:12 [IST]
Other articles published on May 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+